ఏపీలో మూడురాజధానుల అంశం ఎప్పుడైనా హాట్ టాపిక్. విశాఖలో పాలనా రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని అంటూ అప్పటివరకూ వున్న అమరావతి రాజధానిని వికేంద్రీకరించాలని ప్రభుత్వం భావించింది. అయితే న్యాయపరమయిన ఇబ్బందుల నేపథ్యంలో బిల్లుని వెనక్కి తీసుకుంది. సమగ్రమయిన విధానంతో, ఎలాంటి న్యాయపరమయిన చిక్కులు లేకుండా వుండేలా మూడురాజధానుల బిల్లు తేవాలని భావిస్తోంది ప్రభుత్వం. మూడు రాజధానులనేది ఇక రాజకీయ నివాదంగానే ఉంటుందన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవిఎల్ నరసింహారావు. మూడు రాజధానుల…
ఏపీలో మూడురాజధానుల్లో భాగంగా కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర లోకాయుక్త కార్యాలయాన్ని కర్నూలులో ఇంతకుముందే ఏర్పాటు చేశారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహం మూడో నెంబరు గదిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి ప్రారంభించారు. ఇంతవరకు హైదరాబాద్‌లో కొనసాగిన లోకాయుక్త, ఉపలోకాయుక్త కార్యకలాపాలను ఇకపై కర్నూలు నుంచి నిర్వహిస్తారు. తాజాగా కర్నూలు సంతోష్ నగర్ లో లోకాయుక్త నూతన కార్యాలయాన్ని జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి ప్రారంభించారు.…