హైదరాబాద్‌లో రూపుదిద్దుకుంటున్న ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ వల్ల హైదరాబాద్ ఖ్యాతి మరింతగా పెరుగుతుందన్నారు సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. గచ్చిబౌలి లో IAMC నిర్మాణానికి భూమిపూజ చేశారు చీఫ్ జస్టిస్ ఎన్.వీ. రమణ. భారతదేశంలో మొదటి IAMC అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం నిర్మాణానికి హైదరాబాద్ వేదిక కావడం గొప్ప విశేషం అన్నారు. IAMC నిర్మాణానికి గచ్చిబౌలి లోని ఐకియా వద్ద 3.7 ఎకరాల భూమిని ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి మంత్రులు…