Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. ఈ ఏడాది ఢిల్లీలోని రాంలీలా మైదానంలో దసరా రోజు జరిగే రావణ దహన కార్యక్రమంలో ప్రభాస్ పాల్గొననున్నాడు. గతంలోనే ఈ విషయంపై వార్తలు రాగా అయోధ్యలో జరిగిన టీజర్ లాంచింగ్ కార్యక్రమంలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ మేరకు దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ.. రావణ దహన కార్యక్రమంలో తనతో పాటు ప్రభాస్ పాల్గొంటాడని ప్రకటించాడు. ఈ కార్యక్రమానికి నిర్వాహకులు ఇప్పటికే ప్రభాస్‌ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.…