39 killed in fire near Mexico-USA border: సొంత దేశంలో ఉండలేక, అమెరికాకు వెళ్ధామనుకున్న శరణార్ధులను అగ్ని ప్రమాదం బలి తీసుకుంది. మెక్సికోలిని సిడెడ్ జారే నగరంలోని శరణార్థి శిబిరంలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో 39 మంది శరణార్థులు మరణించినట్లు తెలుస్తోంది. మెక్సికన్ నేషనల్ మైగ్రేషన్ ఇనిస్టిట్యూట్ సిబ్బంది అగ్ని ప్రమాదాన్ని ధ్రువీకరించారు. ఈ ప్రమాదంలో మొత్తం 39 మంది మరణించగా.. 29 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన…
Shooting in Mexico bar.. 12 people died: మెక్సికో దేశంలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. గ్వానాజువాటో రాష్ట్రంలో ఒక నెల లోపు రెండు కాల్పుల ఘటనలు జరిగాయి. మెక్సికోలోని ఇరాపుయాటోలోని ఓ బార్ లో గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో మొత్తం 12 మంది మరణించారు. ఇందులో ఆరుగురు మహిళల, ఆరుగురు మగవాళ్లు ఉన్నారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ ఇరాపుటోలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో మెక్సికోలో గన్…
20 killed in Colombia bus accident: లాటిన్ అమెరికా దేశం కొలంబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సులో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా ప్రమాదం సంభవించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. శనివారం జరిగిన ఈ ప్రమాదంలోొ మొత్తం 20 మంది మరణించగా.. 14 మంది గాయపడ్డారు. బ్రేక్స్ ఫెయిల్ కావడం వల్లే బస్సు బోల్తా పడి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కొలంబియా నైరుతి ప్రాంతంలోని పాన్ అమెరికన్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది.
Over 50 students mysteriously poisoned in Mexico school in mexico: మెక్సోకో దేశంలో 57 మంది చిన్నారులపై విషప్రయోగం జరిగింది. దక్షిణ మెక్సికన్ రాష్ట్రమైన చియాపాస్ లో గ్రామీణ మాధ్యమిక పాఠశాలలో 57 మంది విద్యార్థులు గుర్తుతెలియని పదార్థంతో విషప్రయోగం చేశారని స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత లేబొరేటరీ పరిశోధనల్లో విద్యార్థులు కొకైన్ పాజిటివ్ గా తేలినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కలుషితమైన ఆహారం, నీటి వల్లే విద్యార్థుల ఆరోగ్యం…
Gun firing in Mexico.. 18 people died including the mayor: లాటిన్ అమెరికా దేశం మెక్సికో మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఇటీవల కాలంలో ఆ దేశంలో కాల్పుల ఘటనలు తరుచుగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా దక్షిణ మెక్సికోలోని శాన్ మిగ్యుల్ టోటోలాపాస్ నగరంపై ముష్కరులు దాడి చేశారు. ఈ ఘటనలో మేయర్ తో సహా 18 మంది మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మెక్సికన్ మేయర్ కన్రాడో మెన్డోజా సిటీ హాల్ లో…
15 killed in Ecuador prison violence: లాటిన్ అమెరికా దేశం ఈక్వెడార్ లోని ఓ జైలులో ఖైదీల మధ్య తీవ్రఘర్షణ చెలరేగింది. ఈక్వెడార్ లోని లటాకుంగాలోని ఓ జైలులో ఖైదీల మధ్య ఘర్షణల కారణంగా 15 మంది ఖైదీలు మరణించారు. ఈ ఘర్షణల కారణంగా మరో 21 మంది గాయపడ్డారు. మాదకద్రవ్యాల రవాణా మార్గాలపై ముఠాల మధ్య ఘర్షణకు కారణమయ్యాయని అధ్యక్షుడు గిల్లెర్మో లాస్సో అన్నారు. ప్రస్తుతం అధికారులు మృతదేశాలను గుర్తించే పనిలో ఉన్నారు. ఇతర…
Magnitude 7.5 Earthquake Hits Mexico: లాటిన్ అమెరికా దేశం మెక్సికోలో భారీ భూకంపం వచ్చింది. మైకోకాన్ రాష్ట్రంలోని లా స్లతాసిటీ డియోరెలోస్ కు దక్షిణ-ఆగ్నేయంగా 46 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. రిక్టర్ స్కేల్ పై 7.5 తీవ్రతతో భూకంప రావడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మిచోకాన్ తీరానికి సమీపంలో సునామీ వచ్చే అవకాశం ఉన్నట్లు యూఎస్ సునామీ హెచ్చరికలు వ్యవస్థ…
Legionnaire's disease in Argentine: ప్రపంచాన్ని కొత్తకొత్త వ్యాధులు చుట్టుముడుతున్నాయి. తాజాగా మరో కొత్త వ్యాధి లాటిన్ అమెరికా దేశం అయిన అర్జెంటీనాలో ప్రబలుతోంది. లిజియోనెల్లా బ్యాక్టీరియా ద్వారా వచ్చే లెజియోనైర్స్ వ్యాధి బారిన పడుతున్నారు అక్కడి ప్రజలు. ఇప్పటికే ఈ వ్యాధి బారిన 11 మంది పడగా.. నలుగురు మరణించారు. రాజధాని బ్యూనస్ ఎయిర్స్ కు ఉత్తరాన 670 మైళ్ల దూరంలో ఉన్న శాన్ మిగ్యుల్ డి టుకుమాన్ నగరంలో ఈ వ్యాధి వ్యాపించింది.
Swami Vivekananda Statue Unveiled In Mexico: లాటిన్ అమెరికా దేశాల్లోనే తొలిసారిగా స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. మెక్సికో దేశంలోని ఓ యూనివర్సిటీలో స్వామి వివేకానంద విగ్రహాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం ఆవిష్కరించారు. మెక్సికోలోని భారత పార్లమెంటరీ బృందానికి ఓం బిర్లా నాయకత్వం వహించారు. మెక్సికోలోని మిడాల్గోలోని అలానమస్ యూనివర్సిటీ ఆఫ్ స్టేట్ లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వివేకానందుడి బోధనలు, వ్యక్తిత్వం భారతదేశంలోనే కాకుండా ప్రపంచదేశాల ప్రజలకు కూడా…
Lightning Strike on Fuel Tank: లాటిన్ అమెరికా దేశం క్యూబాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. చమురు నిల్వ కేంద్రంపై పిడుగుపాటుకు గురవ్వడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు అధికార లెక్కల ప్రకారం ఒకరు మరణించగా.. 121 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. 17 మంది అగ్నిమాపక సిబ్బంది తప్పిపోయారు. ఇంధన నిల్వ కేంద్రం చుట్టు పక్కల ఉన్న 1900 మందిని సురక్షితన ప్రాంతాలకు…