20 killed in Colombia bus accident: లాటిన్ అమెరికా దేశం కొలంబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సులో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా ప్రమాదం సంభవించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. శనివారం జరిగిన ఈ ప్రమాదంలోొ మొత్తం 20 మంది మరణించగా.. 14 మంది గాయపడ్డారు. బ్రేక్స్ ఫెయిల్ కావడం వల్లే బస్సు బోల్తా పడి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కొలంబియా నైరుతి ప్రాంతంలోని పాన్ అమెరికన్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది.
Read Also: Russia-Ukraine War: రష్యా సైనిక శిక్షణా శిబిరంపై ఉగ్రదాడి..11 మంది మృతి
పాస్టో, పోపాయాన్ మధ్య ఈ ప్రమాదం జరిగింది. నైరుతి కొలంబియాలోని పాస్టో నగరానికి సమీపంలో ఉన్న ఆల్టోస్ డి పెనాలిసాలో ప్రమాదం జరిగింది. బస్సు ఈశాన్య ప్రాంత్రంలో 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న టుమాకో నుంచి కాలికి ప్రయాణిస్తోంది. గాయపడిన వారిలో మూడేళ్ల బాలికతో పాటు, ఎనిమిదేళ్ల బాలుడు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
పొగమంచు ఉండటం, ఈ ప్రాంతంలో మలుపు ఉండటంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. బ్రేక్ సిస్టమ్ ఫెయిల్యూర్ గురించి అధికారులు పరిశోధిస్తున్నారు. ప్రమాదం జరిగిన బస్సు నుంచి మృతదేహాలను బయటకు తీయడానికి తొమ్మిది గంటల సమయం పట్టింది. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రులకు తరలించారు.