విజయనగరం జిల్లాలో నేడు నలుగురు హైకోర్టు న్యాయమూర్తులు పర్యటించనున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్, జస్టిస్ సీహెచ్. మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ చీమలపాటి రవి, తల్లాడ రాజశేఖర్ లు ప్రత్యేక పర్యటించనున్నారు. ఈ సందర్భంగా స్థానిక కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ అడ్వకేట్ గేదెల రామ్మోహన్ రావు చిత్రపటాన్ని కోర్టు హాలులో న్యాయమూర్తులు ఆవిష్కరించనున్నారు. ఇటీవల హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన వారికి…
తిరుపతిలోని చంద్రగిరి మండలం బాకరాపేట ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధర్మవరం నుంచి తిరుపతి వస్తున్న పెళ్లి బృందం బస్సు లోయలో పడింది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉండగా, సుమారు 300 అడుగుల లోయలో పడ్డ బస్సు పడిపోయింది. దీంతో ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటినా పోలీసులు, అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే రెడ్ శ్యాండిల్ టాస్క్ఫోర్స్, పోలీసులు, ఫైర్ సిబ్బంది, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొని…
శనివారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో గతంలో ప్రవేశపెట్టిన ఉచిత రేషన్ పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ నిర్ణయంతో ఈ ఏడాది సెప్టెంబర్ దాకా పేదలకు ఉచిత రేషన్ అందనుంది. ఈ పథకం కింద దేశంలోని 80 కోట్ల మందికి లబ్ధి చేకూరుతోంది. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పేరిట కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా…
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. ఇంధన కొరత, వంట గ్యాస్ కొరత కారణంగా ఆ దేశంలో వేలాది హోటళ్లు మూతపడ్డాయి. దీంతో ప్రజలు అంధకారంతో పాటు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది పక్క దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో తీవ్రమైన ఇంధన కొరత ఎదుర్కొంటున్న శ్రీలంకకు భారత్ ఆపన్న హస్తం అందించింది. అత్యవసరంగా 40వేల టన్నుల డీజిల్ పంపించాలని నిర్ణయించింది. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దీన్ని రవాణా…
తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే నడుస్తున్న సైనిక్ స్కూళ్లకు అదనంగా మరో 21 సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు కేంద్ర రక్షణ శాఖ శనివారం ఆమోదం తెలిపింది. పీపీపీ పద్ధతిలో నడిచే ఈ కొత్త సైనిక్ స్కూళ్లలో 7 డే స్కూళ్లుగా పనిచేయనుండగా.. 14 మాత్రం రెసిడెన్షియల్ మోడ్‌లో నడవనున్నట్లు రక్షణ శాఖ ప్రకటన చేసింది. ఇక కొత్తగా ఏర్పాటు కానున్న 21 సైనిక్ స్కూళ్లలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కోటి చొప్పున…
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (OTS) కింద ఖజానాకు బాగానే డబ్బులు వచ్చి చేరుతున్నారు. ఇప్పటివరకు ఈ పథకం కింద అన్ని జిల్లాల్లో కలిపి రూ.339 కోట్లు వసూలు అయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది. 9.86 లక్షల మంది లబ్ధిదారులు రూ.10,000 చొప్పున చెల్లించి తమ ఇళ్లు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం అత్యధికంగా వినియోగించుకున్న లబ్ధిదారుల జాబితాలో టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లా ఉండటం…
ఏపీలో కొత్త జిల్లాలపై తుది నోటిఫికేషన్ ఏప్రిల్ 1 నాటికి వస్తుందని ఏపీ ప్లానింగ్ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ వెల్లడించారు. అయితే ముందుగా అనుకున్న విధంగా 11 రెవెన్యూ డివిజన్లు కాకుండా అదనంగా మరో ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఏపీలో మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య 15కి చేరనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానికుల నుంచి ఇప్పటి వరకూ 9 వేలకు…
దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు వరుసగా పెరుగుతూ పోతున్నాయి. గత ఐదు రోజుల్లో నాలుగోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో సామాన్యులపై భారం పడుతూనే ఉంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలను కేంద్రం పెంచుతోందని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. అయితే ఈ విమర్శలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు, ఎన్నికలకు సంబంధం లేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్పై రష్యా…