మొన్నటికి మొన్న అమ్నిషియా పబ్ రేప్ కేసు ఘటన మరువక ముందే మరో ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. 14ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు దుండగులు.. వివరాలిలా.. పాతబస్తీకి చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన 14 ఏండ్ల బాలిక ఈ నెల 17న రాత్రి తల్లితో గొడవ పడి బయటకు వచ్చింది. 2 కిలోమీటర్ల దూరంలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి తన ఇంటికి వెళ్తున్న సమయంలో ఆటోలోని నలుగురు…
ఈ సారి రాష్ట్రపతి ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలపై ప్రతి సారి అధికార పార్టీదే పై చేయి ఉంటున్న నేపథ్యంలో తాజాగా విపక్షాలు కూటమి అధికార పార్టీకి తలనొప్పిగా తయారైందని చెప్పొచ్చు. అయితే నేడు మరోసారి దేశరాజధాని ఢిల్లీలో భేటీ అయిన విపక్షాల కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ప్రకటించాయి. బీజేపీ నుంచి బయటకు వచ్చిన యశ్వంత్ సిన్హా ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే గత కొంత కాలంగా జాతీయ రాజకీయాల్లో…
సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గిరిజనులు మరో పోరాటంకి సిద్దం అవ్వండని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేందుకు సిద్దం అవ్వండని, పొడు భూములకు పట్టాలు ఇస్తారు అని నమ్మినము.. కానీ మోసం జరిగిందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. పోడు భూములకు పట్టాలు ఇచ్చింది.. భూములు పంచింది కాంగ్రెస్సే అని ఆయన వెల్లడించారు. మిగిలి ఉన్న భూములకు కూడా పట్టాలు కాంగ్రెస్ ఇస్తుందని…
ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకునే ముందు తమ వాదన వినాలని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం విన్నవించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్ర సర్కారు కేవియట్ దాఖలు చేసింది. అగ్నిపథ్‌పై ఇప్పటివరకు మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది హరీశ్ అజయ్ సింగ్ సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. ఎంఎల్ శర్మ అనే న్యాయవాది అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సుప్రీంలో పిల్ దాఖలు చేసి…
కరెంట్ బిల్లు పేరుతో లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లు కాజేసిన ఘటన హైదరాద్‌లో చోటు చేసుకుంది. మెహిదీపట్నంకి చెందిన వ్యక్తి ఫోన్ కి కరెంట్ బిల్లు కట్టాలని, కరెంట్ బిల్లు కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామని సైబర్ నేరగాళ్లు మెసేజ్ పంపించారు. అయితే దీంతో ఖంగుతిన్న అతను అమెరికా నుంచి వచ్చిన తన కొడుకుకి ఆ మెసేజ్ చూపగా, అది నిజమేనేమో అనుకున్న అతని కొడుకు మెసేజ్ వచ్చిన ఫోన్ కి ఫోన్ చేశాడు. దీంతో కేటుగాళ్లు…
ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీగా బంగారం పట్టుబడింది. విదేశీ ప్రయాణీకుల వద్ద 10 కోట్ల విలువ చేసే 21.2 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుండి ముంబాయి వచ్చిన 16 మంది విదేశీ ప్రయాణీకులు వద్ద ఈ బంగారం దొరికింది. అయితే.. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారం బిస్కట్ లను బ్యాగ్ లో దాచారు కేటుగాళ్లు. ముంబై ఎయిర్ పోర్ట్ లో విమానం దిగగానే కస్టమ్స్ అధికారులతో గొడవకు…
సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. ట్వట్టర్ వేదికగా.. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ నిరంకుశ పాలనను సాగిస్తోందని, రాష్ట్రంలో ఏ పథకాన్నీ సరిగ్గా అమలు చేయడం లేదు. ఒక్కటి కాదు, రెండు కాదు… ప్రతి దానిలోనూ తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు విజయశాంతి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యానికి కోత పెట్టిన రాష్ట్ర సర్కారు… రూపాయికి కిలో బియ్యం కూడా సక్కగ ఇస్తలేదు. రేషన్ షాపులకు సకాలంలో బియ్యం సరఫరా చేయకపోవడంతో పేదల కడుపు…
గతేడాది రిపబ్లిక్ మూవీతో మంచి హిట్ అందుకున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్ గురైన సంగతి తెలిసిందే. దాంతో కోలుకోవడానికి సాయికి చాలా సమయం పట్టింది. ఇక అంతా సెట్ అయ్యాక.. తిరిగి సినిమా సెట్లోకి అడుగుపెట్టాడు సాయి ధరమ్. ప్రస్తుతం తన 15వ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇటీవలే SDT15 పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సుకుమార్ రైటింగ్స్‌లో కార్తిక్ దండు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.…