ప్రముఖ ల్యాప్ టాప్ కంపెనీ ఏసర్(Acer).. ALG గేమింగ్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ముఖ్యంగా గేమింగ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ ల్యాప్ టాప్ ను లాంచ్ చేసింది. ఇది 16 GB వరకు DDR4 RAM, Nvidia GeForce RTX 3050 GPUతో 12వ జెనరేషన్ ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది.
భారతదేశంలోని చాలా మంది ప్రజలు మధ్యాహ్నం పూర్తి మొత్తంలో అన్నం తినడానికి ఇష్టపడతారు. అయితే ఇది మగత, బరువు పెరగడానికి కారణమవుతుంది. బియ్యాన్ని ఉడికించే ముందు కాసేపు నీటిలో నానబెట్టడం వల్ల ఈ సమస్యలను నివారించవచ్చు.
ఆస్తి కోసం మామను హతమార్చేందుకు కోడలు ప్లాన్ వేసింది. తాను అనుకున్నట్లు గానే ఆ ప్లాన్ ఫలించింది. ఓ వ్యక్తికి కాంట్రాక్టు ఇచ్చి తన మామను కారుతో గుద్దించి చంపేసింది. పోలీసులు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు కేసు నమోదు చేసుకున్నారు.
సూడాన్‌లో తిరుగుబాటు దళాల దాడిలో దాదాపు 150 మంది మరణించారు. 200 మంది గాయపడ్డారు. స్థానిక అధికారులు, సాక్షులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఏడాది కాలం యుద్ధంలో ఇప్పటి వరకు 7 మిలియన్ల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.
రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ సమీపంలో నదిలో అయిదుగురు భారతీయ విద్యార్థులు మునిగిపోయారు. స్థానికులు అందులో ఒకరిని రక్షించారు. నలుగురు పూర్తిగా నీటిలో ముగిని మృతి చెందారు. ఈ మృతదేహాలను వీలైనంత త్వరగా వారి బంధువులకు పంపించడానికి రష్యా అధికారులతో సమన్వయం చేస్తున్నామని దేశంలోని భారతీయ మిషన్లు శుక్రవారం వెల్లడించాయి.
నీట్ యూజీ ఫలితాలు వెలువడినప్పటి నుంచి "ఎక్స్" లో సందడి నెలకొంది. 'నీట్ పేపర్‌ని రద్దు చేయండి' అనే హ్యాష్‌ట్యాగ్ "X" (ట్విట్టర్)లో వేగంగా ట్రెండ్ అవుతోంది. ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఈ పరీక్షపై సందిగ్ధత నెలకొంది.
యూపీ రాజధాని లక్నోలోని దేవా రోడ్‌లో ఉన్న ఓయో రెడ్ బిల్డింగ్ గెస్ట్ హౌస్‌లోని రూమ్ నంబర్ 105లో 22 ఏళ్ల యువతి మృతదేహం లభ్యమైంది. అమ్మాయి బారాబంకి నివాసిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
నీట్ పరీక్ష ఫలితం 2024 ప్రకటించిన తర్వాత.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సమగ్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వాస్తవానికి ఈ ఏడాది ఫలితాల్లో 720కి 720 మార్కులు తెచ్చుకున్న 67 మంది విద్యార్థులు ఉన్నారు. ఫలితాలు చూసిన తర్వాత ఇంత మంది పిల్లలకు పూర్తి మార్కులు ఎలా వచ్చాయి అనే ప్రశ్నలు తలెత్తాయి.
అమెరికన్ ఫోన్ల తయారీ సంస్థ Apple.. iPhone 16 సిరీస్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించవచ్చని సమాచారం. ఈ శ్రేణిలోని ప్రో మోడల్‌లలో బెజెల్‌లను సన్నబడవచ్చు. ఇది స్మార్ట్ఫోన్ల పరిమాణాన్ని పెంచకుండా పెద్ద స్క్రీన్‌ను అందించడం కంపెనీకి సులభతరం చేస్తుంది.