Crime: రూ.300కోట్ల ఆస్తి కోసం మామను హత్య చేయించిన కోడలు.. కట్ చేస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్తి కోసం మామను హతమార్చేందుకు ఓ కోడలు ప్లాన్ వేసింది. తాను అనుకున్నట్లు గానే ఆ ప్లాన్ ఫలించింది. ఓ వ్యక్తికి కాంట్రాక్టు ఇచ్చి తన మామను కారుతో గుద్దించి చంపేసింది. పోలీసులు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు కేసు నమోదు చేసుకున్నారు. కట్ చేస్తే.. మృతుడి సోదరుడికి అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులను సంప్రదించి ఇది ప్రమాదం కాదని హత్య అని ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు అసలు విషయం తెలుసుకుని కంగుతిన్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది.
READ MORE: Kerala: బస్సులో నుంచి కిందపడబోతున్న ప్రయాణికుడిని కండక్టర్ ఎలా కాపాడాడో చూడండి..
Also Read
పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో రూ.300 కోట్ల ఆస్తిని లాక్కోవడానికి కోడలు తన సొంత మామని కాంట్రాక్టు ఇచ్చి హత్య చేయించింది. తొలుత ఈ కేసును యాక్సిడెంట్‌గా చూపించే ప్రయత్నం జరిగింది. మే 22న నాగ్‌పూర్‌లోని మానేవాడ కాంప్లెక్స్‌లో పురుషోత్తం పుట్టేవార్ (82 )ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు మృతి చెందారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ ప్రమాదంపై పోలీసులు ప్రాథమికంగా కేసు నమోదు చేశారు.
ఘటన అనంతరం మృతుడి సోదరుడు తనకు హత్యగా అనుమానిస్తున్నట్లు పోలీసు అధికారికి తెలిపారు. ఆ దిశగా పోలీసులు విచారణ ప్రారంభించగా.. ఒకదాని తర్వాత మరొకటి దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో సీసీటీవీ ఆధారంగా పోలీసులు కారు డ్రైవర్లు నీరజ్ నిమ్జే, సచిన్ ధర్మిక్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో.. ఇద్దరూ మృతుడి కోడలు అర్చన పుట్టేవార్ నుంచి డబ్బు తీసుకొని ఆమె మామగారిని కారుతో ఢీకొట్టినట్లు పోలీసులకు చెప్పారు. అర్చన ప్రభుత్వ అధికారి అనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Temple Incident : అమ్మవారి గుడిలో అర్చకుడి దారుణం.. బయట తాళం.. లోపల వికృత చేష్టలు
-
IND vs SL 2nd Test Day 4: కొలంబోలో వర్షం కారణంగా ముందుగానే ఆట ముగింపు.. ఎవరిది పైచేయి?
-
Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
-
Kitchen Tips: అల్లం తొక్క క్షణాల్లో ఊడిపోవాలంటే ఈ టెక్నిక్ పాటించండి
-
IND vs SL: జడేజా ఖాతాలో చెత్త రికార్డు.. అందులో నంబర్ వన్!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..