Revanth Reddy: ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ భేటీ..కీలక అంశాలపై చర్చ
- నిన్న ఇద్దరు కేంద్ర మంత్రులను కలిసిన సీఎం
- ఇవాళ కేంద్ర మంత్రి జేపీ నడ్డా తో సమావేశం
- నేడు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో పలు అంశాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నిన్న ఇద్దరు కేంద్ర మంత్రులను సీఎం కలిశారు.
ఇవాళ కేంద్ర మంత్రి జేపీ నడ్డా తో సమావేశం కానున్నారు. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని తీసుకెళ్లి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిశారు. నేడు అధిష్టానం పెద్దలతో పలు అంశాలపై రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికలు, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, పీసీసీ అధ్యక్ష మార్పు, తెలంగాణ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ వంటి అంశాలపై అధిష్టాన పెద్దలతో చర్చించనున్నట్లు సమాచారం.
READ MORE: Shamshabad: శంషాబాద్ ఘన్సీమియాగూడ గుర్తుతెలియని జంతువు సంచారం..భయాందోళనలో జనాలు
Also Read
- Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
కాగా.. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న (24వ తేదీన) కేంద్ర గృహ, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, కడియం కావ్య, సురేష్ షెట్కా్‌ర్ ఉన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటిని వచ్చేలా సహకరించాలని సీఎం కేంద్ర మంత్రిని కోరారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీఎల్‌సీ మోడల్‌లో తెలంగాణకు 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిరుపేదలకు వారి సొంత స్థలాల్లో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. కేంద్ర మంత్రి ఖట్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రంలో తాము నిర్మించదల్చిన 25 లక్షల ఇళ్లలో 15 లక్షలు ఇళ్లు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి వస్తాయని, వాటిని లబ్ధిదారు ఆధ్వర్యంలోని వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం (బీఎల్‌సీ) పద్థతిలో నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రికి వివరించారు.
తాజావార్తలు
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!