Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన రాష్ట్ర మంత్రులు కోమటి రెడ్డి, పొంగులేటి..
- కిషన్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపిన మంత్రులు
- రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- సానకూలంగా స్పందించినట్లు స్పష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర మంత్రులు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రిగా పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ బిడ్డ కేంద్ర మంత్రిగా పదవీ చేపట్టిన సందర్భంగా పార్టీలకు అతీతంగా కిషన్ రెడ్డిని కలిసి సత్కరించడం జరిగిందన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు తెలిపారు. ఎలాంటి సహయ సహకారాలు కావాలన్నా అందుబాటులో ఉండి చేస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
READ MORE: Swati Maliwal : నేను 13రోజులు చేశాను.. అతిషి నాలుగు రోజులకే.. స్వాతి మలివాల్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
కాగా.. జూన్ 24న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి తెలుగులో లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం నేతృత్వంలో 18వ లోక్‌సభ జరుగుతోంది. సమావేశం ప్రారంభమైన తొలిరోజు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తిహరి మహతాబ్ ప్రమాణం చేయించారు. ఈ క్రమంలో తెలంగాణలోని సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన ఎంపీ కిషన్‌రెడ్డి, కరీంనగర్ నుంచి గెలిచిన బండి సంజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రులిద్దరూ తెలుగులోనే ప్రమాణం చేశారు. తొలుత ప్రధాని మోడీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కేంద్ర మంత్రులు, ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
-
Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
-
Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!