లోక్‌సభ ఎన్నికల అనంతరం ఎన్నికల సంఘం డేటాను విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం.. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల ఓటింగ్ గణాంకాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ఓటరు జాబితాలో తమ పేర్లను చేర్చుకునే సమయంలో వీరిలో చాలా ఉత్సాహం కనిపించిందని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటరు జాబితాలో 1.2 లక్షల మంది తమ పేర్లను చేర్చుకోగా, ఎన్నికల సమయంలో కేవలం 2.48 శాతం మంది మాత్రమే ఓటు వేయడానికి భారతదేశానికి వచ్చారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు అధికారులు మరో మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని అధికారులు సూచిస్తున్నారు.. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వానలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు రెయిన్ అలర్ట్ జారీ చేస్తూ వెదర్ రిపోర్ట్ ను విడుదల చేసింది.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు..…