ఇటీవల గాంధీభవన్‌లో మహిళా కాంగ్రెస్ నేతల సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. మహిళా నేతలు సునీతరావు, కవిత మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఇరువురు బూతులు తిట్టుకున్నారు. అనంతరం సమావేశంలో నుంచి కవిత బయటకు వెళ్లిపోయింది. ఈ ఘటన ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన బహిర్గతం కావడంతో పార్టీ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకొని క్రమ శిక్షణ చర్యల కింద కవితను ఆమె పదవి నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ…
తెలంగాణ బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్రలో నేడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జోగులాంబ జిల్లాలోని ఇటిక్యాల మంలో బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్న సమయంలో టీఆర్‌ఎస్ శ్రేణులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ నెలకొంది. టీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ‘బండి సంజయ్ గారు చేస్తున్న ప్రజా…
Manda Krishna Madiga Made Comments On CM KCR. రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ మాటలు అర్ధరహితమని మందకృష్ణ మాదిగ అన్నారు. బుధవారం ఆయన మెదక్‌లోని టీఎన్జీవో భవన్‌లో రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేయడానికే సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటున్నడని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి కేసీఆర్ వ్యతిరేకమని ఆయన విమర్శించారు. పాలకులను ప్రశ్నించే స్వేచ్ఛను ప్రజలు కోల్పోయే ప్రమాదం ఉందని, సీఎం కేసీఆర్ రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకి…