ధాన్యం కొనుగోళ్లపై టీఆర్‌ఎస్ నేతలు కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్నారు. తెలంగాణపై కేంద్రం కక్షసాధింపుకు దిగిందని టీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కేంద్రం ధాన్యం కొనుగోలు చేసేవరకు నిరసన కార్యక్రమాలు చేపట్టి ధాన్యం కొనుగోలు చేసేలా చేస్తామంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, టీఆర్ఎస్ రాజ్య సభ ఎంపీ కేశవరావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నామని, తెలంగాణలో వచ్చే రబి ధాన్యాన్ని కేంద్రం కొనాలని ఆయన డిమాండ్…
బంగారం సినిమాలో పవన్ సరసన నటించి మెప్పించిన హీరోయిన్ మీరా చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తరువాత అమ్మడికి ఆశించిన అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ కు మాకాం మార్చిన ఈ బ్యూటీ గతంలో ఎన్టీఆర్ పై అనుచిచిత వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఒకానొక రోజు చిట్ చాట్ సెషన్ లో తెలుగులో మీకు ఇష్టమైన హీరో ఎవరు అని అడగగా.. మహేష్ బాబు పేరు చెప్పిన మీరా.. అదే…
మిల్కీ బ్యూటీ తమన్నా త్వరలోనే పెళ్లి కూతురు కానున్నదట. హ్యాపీ డేస్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ఈ బ్యూటీ సౌత్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ఇటీవల కరోనా బారిన పడిన తమన్నాకు అవకాశాలు తగ్గినప్పటికీ టీవీ షోలు, సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ కెరీర్‌ను బిజీగా మలుచుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఎప్పటి నుంచో తమన్నా పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గని. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 8 న రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక బాక్సర్ గా వరుణ్ నట విశ్వరూపం చూపించాడనే చెప్పాలి. ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, నదియా కీలక పాత్రలో కనిపించిన ఈ సినిమా ఓటిటీ హక్కులను ఆహా వారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది…
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న రిలీజ్ అవుతుందని ఇప్పటికే ప్రకటించారు. అయితే శనివారం మరోసారి ఆ విషయాన్ని చిత్ర బృందం ఖరారు చేసింది. ఇదిలా ఉంటే… ఈ మూవీ ట్రైలర్ ను ఈ నెల 12న విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. చిరంజీవి సరసన కాజల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించిన ఈ మూవీని అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న కొరటాల శివ తెరకెక్కించాడు. నిరంజన్…
ప్రతిభ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి మరీ పట్టం కట్టడంలో తెలుగువారికి సాటి మరెవరూ రారు. అలా పరభాషల్లో రాణించేవారిని సైతం పట్టుకు వచ్చి తెలుగు చిత్రాలలో తగిన అవకాశాలు కల్పిస్తూంటారు మనవాళ్ళు. నటి నిత్య మీనన్ సైతం అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్నా, తెలుగు భాషను నచ్చి మెచ్చి, నటించడంతోనే కాదు, తన గళంతోనూ ఆకట్టుకుంది. 1988 ఏప్రిల్ 8న బెంగళూరులో పుట్టిన నిత్య మీనన్ మాతృభాష మళయాళం. చిన్న తనం నుంచీ అన్నిటా చురుగ్గా ఉండే…
తాత ఏయన్నార్ మహానటుడు. తండ్రి నాగార్జున టాప్ స్టార్. అన్న నాగచైతన్య యంగ్ హీరోస్ లో తనకంటూ ఓ స్థానం సంపాదించాడు. ఇక మిగిలింది అక్కినేని అఖిల్ వంతు. ఏడాది దాటిన వయసులోనే అఖిల్ ‘సిసింద్రీ’గా జనాన్ని మెప్పించాడు. అప్పటి నుంచీ అక్కినేని ఇంట మరో ప్రతిభావంతుడు పుట్టాడని జనం భావించారు. దోగాడే పసిపాపగా ఉన్న రోజుల్లోనే అలరించిన అఖిల్ కథానాయకునిగానూ మెప్పిస్తాడని అభిమానులు ఆశించారు. ఎందుకనో వారి ఆశలు అంతగా ఫలించలేదు. గత యేడాది ‘మోస్ట్…
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నిర్మాత నట్టి కుమార్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వర్మ తన సినిమాలకు నట్టి కుమార్ వద్ద రూ.5 కోట్ల 29 లక్షలు తిరిగి ఇవ్వలేదని, ఆ డబ్బు తిరిగి చెల్లించేవరకు మా ఇష్టం సినిమాను రిలీజ్ చేయకుండా ఆపాలని నట్టి కుమార్ కేసు వేశాడు. దీంతో కోర్టు సినిమాను రిలీజ్ చేయకుండా స్టే విధించింది. ఇక రామ్ గోపాల్ వర్మ ఒక మోసగాడు, అతడి బండారం బయటపెడతాను అంటూ …
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా శివ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆచార్య. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ పై సురేఖ కొణిదెల నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ఏప్రిల్ 28 న రిలీజ్ కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్స్…