బీజేపీ నాయకులు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నారాయణగూడ చౌరస్తాలో బీజేపీ నేత దిష్టిబొమ్మను ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు దహనం చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా నారాయణగూడ చౌరస్తాలో నిరసన తెలిపారు కాంగ్రెస్ నేతలు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు వెంటనే రాహుల్ గాంధీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై…
యువగళం పాదయాత్రలో ఇచ్చిన తోలి హామీ అమలు చేశారు మంత్రి నారా లోకేష్. ఇచ్చినా హామీ మేరకు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసినా లోకేష్ స్వయంగా రేపు డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నారు.
పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు నేతృత్వంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ గంటా పద్మశ్రీ వైసీపీకి రాజీనామా చేసి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు.
నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం మండలం బంగారక్కపాలెంలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని యువతిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. రామకృష్ణ అనే యువకుడు ఉద్యోగం చేస్తున్న రమ్య అనే యువతిని గత కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు తెలిసింది. అమ్మపాలెం గ్రామానికి చెందిన రమ్య వెంట తనను ప్రేమించాలని ఎంతో కాలంగా వేధిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డీ శ్రీధర్‌బాబు సూచించారు. సంగారెడ్డి జిల్లా సంగుపేట, నారాయణపేట జిల్లా మద్దూరు, పెద్దపల్లి జిల్లా అడవిశ్రీరాంపూర్ వంటి మూడు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయనున్నట్లు మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. ఇంటర్నెట్‌తో పాటు, కేబుల్ టీవీ సేవలు, కంప్యూటర్ కనెక్టివిటీ, మొబైల్ ఫోన్‌లకు 20 MBPS అపరిమిత డేటా కూడా ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ద్వారా అందించబడుతుంది. 360 డిగ్రీల…
హైదరాబాద్ కూకట్ పల్లి IDL చెరువు వద్ద ఏర్పాట్లను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను అడిగి నిమజ్జన ఏర్పాట్ల వివరాలను తెలుసుకున్నారు ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో కులమతాలకు అతీతంగా ప్రతి ఏటా వినాయక నిమజ్జనాలు జరుగుతాయన్నారు. చెరువుల్లో బేబీ పాండ్ లను ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలను నిమజ్జనాలు చేస్తున్నారన్నారు. హుస్సేన్ సాగర్ లాంటి మురికి నీళ్లల్లో నిమజ్జనం చేయడం బాధాకరమన్నారు ఈటల రాజేందర్. ప్రభుత్వం ప్రత్యేకంగా…
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల కోసం గత ప్రభుత్వం చేసిన అప్పులు ఇప్పుడు ప్రభుత్వానికి ఆర్థికంగా భారంగా మారినందున వాటిపై విధించిన వడ్డీని పూర్తిగా లేదా పాక్షికంగా తగ్గించేలా కేంద్ర ప్రభుత్వ రంగ ద్రవ్య సంస్థలను ఒప్పించేలా చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వీలైతే మొత్తంగా క్లియర్ చేయాలని, లేదా పాక్షికంగానైనా మాఫీ చేయాలని కోరినట్లు తెలిపారు. మంగళ వారం నాడు న్యూ ఢిల్లీ లోని భారత…
ఏపీలో మరో ఎన్నికల హామీ అమలు దిశగా కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. బీసీ ప్రొటెక్షన్ యాక్టు రూపకల్పనకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ రూపొందించనున్నామని, ఈ మేరకు బీసీ ప్రొటెక్షన్ చట్టం రూపకల్పనపై సీఎం ఆదేశాలు జారీ చేశారని మంత్రి సవిత వెల్లడించారు.