నెల రోజుల పాలనలో ప్రజలకు మరింత దగ్గరయ్యామన్నారు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీటి పారుదల శాఖలో జవాబుదారీ, పారదర్శకంగా పని చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రజా పాలన అంటే ఎలా ఉండాలో నెల రోజుల్లోనే చేసి చూపించామని, ప్రజలు తెలంగాణ లో కొత్తగా స్వాతంత్రం వచ్చినట్టు భావిస్తున్నారు. ఒక నియంత పాలన అంతమైందన్న ఆనందంలో ఉన్నారన్నారు. ప్రజలకు పాలకులు, అధికారులు నిరంతరం అందుబాటులో…
సింగరేణి కాలరీస్ బొగ్గు ఉత్పత్తితోపాటు థర్మల్, సోలార్ రంగంలోనూ విజయవంతంగా అడుగుపెట్టిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా సోలార్ రంగంలో ఉండే అవకాశాలను అందిపుచ్చుకోవాలని సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు. ముఖ్యంగా సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల్లో సోలార్ ప్రాజెక్టులు చేపట్టాలని అధికారులకు సూచించారు. సింగరేణి థర్మల్, సోలార్ విద్యుత్ సమీక్ష సమావేశంలో ఆయన సంబంధిత అధికారులతో సమగ్రంగా చర్చించారు. రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో సోలార్ రంగంలోకి అడుగుపెట్టి కమర్షియల్…
ఈ ఏడాది సింగరేణిలో ప్రారంభించే 4 కొత్త గనులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరి కొన్ని నూతన బొగ్గు బ్లాకుల సాధించేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు పోతున్నామని సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ సింగరేణిలో కొత్త గనులపైనిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన పలు అంశాలపై లోతుగా చర్చించారు. నూతన గనులపై తగిన కార్యాచరణతో ముందుకెళ్లాలని, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్ని ఏరియాల జీఎంలను ఆదేశించారు.…
ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర అని అన్నారు మంత్రి సీతక్క. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మేడారం భక్తుల సౌకర్యార్థం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 75 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అధికారుల అందరు సమన్వయంతో జాతర పూర్తి చేయాలని ఆమె వెల్లడించారు. జాతరకు వచ్చే భక్తుల ప్లాస్టిక్ వినియోగం తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. జనవరి నెల లాస్ట్ వరకు జాతర పనులు పూర్తి చేస్తామని, రాష్ట్రస్థాయిలో సీఎం…
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీఎస్ బీఐఈ) శనివారం జూనియర్ కాలేజీలకు జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. జనవరి 17న కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. అన్ని జూనియర్ కళాశాలలకు – ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్ మరియు అన్ ఎయిడెడ్, కో-ఆపరేటివ్, TS రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్, BC వెల్ఫేర్, KGBVలు మరియు ఇన్సెంటివ్ జూనియర్ కాలేజీలకు సెలవు వర్తిస్తుంది. ముఖ్యంగా…
మెదక్ పట్టణంలో ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. ప్రజల నుంచి అభయ హస్తం దరఖాస్తులు మంత్రి దామోదర రాజనర్సింహ స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. వ్యవస్థ అనేది శాశ్వతం… వ్యవస్థను ఎంత ప్రతిష్ట పరిస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో అన్యాయం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క గ్రామంలో ఇల్లు దిక్కులేదు..జాగా దిక్కులేదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విజన్ ఉందన్నారు. ఇచ్చిన గ్యారెంటిలను…
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు త్వరలో ప్రజల మధ్యకు వస్తారని మాజీ మంత్రి హరీష్ రావు శనివారం అన్నారు. తెలంగాణ భవన్‌లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ శస్త్రచికిత్స తర్వాత చంద్రశేఖర్‌రావు కోలుకుంటున్నారని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మనముందుకు వస్తారన్నారు. ఫిబ్రవరి నుంచి తెలంగాణ భవన్‌లో చంద్రశేఖర్‌రావు ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. రోజు వారీగా పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో మమేకమవుతారు. జిల్లాల్లోనూ పర్యటిస్తానని హరీష్ రావు…
అద్భుత అవకాశాల వేదిక అయిన విశాఖ నగరం 2030 నాటికి $100 బిలియన్ల ఆర్థికవృద్ధి సాధించేందుకు దోహదపడుతుందని పల్సస్ సీఈవో డా.గేదెల శ్రీనుబాబు వివరించారు. విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరంలోని ఇంజినీరింగ్ , MBA విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు, వైజాగ్‌ను $100 బిలియన్ల ఆర్థిక నగరంగా తీర్చి దిద్దెందుకు ఉన్న అవకాశాలను, ప్రణాళికలను వివరించారు. నగర ఆర్థిక గమ్యాన్ని రూపొందించడంలో విద్యార్థులు కీలకపాత్ర పోషించాలని శ్రీనుబాబు పిలుపునిచ్చారు. తరగతి గదులలో,…
కామారెడ్డి నిర్వహిస్తోన్న ప్రజా పాలన కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహిస్తోన్న ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చిన ప్రజలను ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని సమస్యలకు పరిష్కారం జరుగుతుందని ఆయన వెల్లడించారు. అందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీ చెప్పిన విధంగా రాష్ట్రంలో దొరల పాలనను ఓడించి కాంగ్రెస్ పాలన తీసుకువచ్చామని, సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల అమలుకు ప్రజల వద్ద…