జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకూ పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన కోసం జనసేన నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిరోజు భీమవరంలో వివిధ సమావేశాల్లో పవన్ పాల్గొననున్నారు.
టిడ్కో ఇళ్లను వెంటనే పేదలకి ఇవ్వాలని జనసేన నేత జానీ మాస్టర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలో జనసేన నేత జానీ మాస్టర్ ఆధ్వర్యంలో కె.వి.ఆర్ సర్కిల్ నుంచి వెంకటేశ్వరపురంలోని టిడ్కో ఇళ్ల వరకూ ర్యాలీ నిర్వహించారు.
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగాడు.. ఈ మధ్య ట్రిపుల్ ఆర్ సినిమా తో గ్లోబల్ స్టార్ అయ్యాడు.. ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ క్రేజ్ దేశవిదేశాలకు విస్తరించింది. భారీ సంఖ్యలో ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. అయితే ఎన్టీఆర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది.. అతనికి ఇలాంటి…
ఏపీలో సంచలనంగా మారిన ఎమ్మార్వో రమణయ్య మర్డర్ కేసులో నిందితుడిని 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. కస్టడీలో భాగంగా పోలీసులు రెండో రోజు పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌లో నిందితుడిని విచారిస్తున్నారు. ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో నిందితుడు గంగారాం కాల్ డేటా కీలకంగా మారింది.
ఏపీలో టీడీపీతో పొత్తుపై త్వరలో క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ వైపు సీఎం జగన్, మరోవైపు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసిన చర్చించిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలో పొత్తుల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఏపీలో పొత్తులపై కొన్ని రోజుల్లోనే నిర్ణయం ఉంటుందని అమిత్ షా అన్నారు.
చంద్రబాబు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని, పిల్లలకు ఇంగ్లీషు మీడియం ఇవ్వొద్దని కోర్టుకు వెళ్లారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లివూరులో గ్రామ సచివాలయ భవనాన్ని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రారంభించారు.
తమిళనాడులో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఎన్‌ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి.
Bandi Sanjay: వచ్చే లోక్సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘ప్రజాహిత యాత్ర’ పేరుతో మొత్తం 119 కి.మీల మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పాదయాత్ర చేపట్టనున్నారు. సంజయ్ ఇవాల ఉదయం జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు కొండ పుణ్యక్షేత్రంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్లోని మేడిపల్లి గ్రామంలో తన మొదటి…
సంక్రాంతి కానుకగా విడుదలై భారీ ప్రభంజనాన్ని సృష్టించిన సినిమా హనుమాన్.. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా జనాలను బాగా ఆకట్టుకుంది.. గతంలో ఏ సినిమాకు దక్కని రికార్డ్ ను కైవసం చేసుకుంది.. పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టడం అంటే అంత ఈజీ కాదు. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ఇప్పుడు పాన్ ఇండియా హిట్ అందుకొని రికార్డ్ సెట్ చేశాడు. తేజ నటించిన నటించిన ‘హనుమాన్’ బ్లాక్ బస్టర్…
శంభో శంకరా.. కాపాడవయ్య అంటూ భక్తులు శివ నామ స్మరణ చేస్తూ భక్తులు శివాలయాలకు వెళ్తుంటారు.. ఎంతో పవిత్రంగా ఉండే శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ఆలయంలో అపచారం జరిగింది.. విషయానికొస్తే.. శ్రీశైలం వచ్చిన ఓ హైదరాబాద్ భక్తుడు.. శివయ్య దర్శనం తర్వాత ఆలయంలో పులిహోర ప్రసాదం కొనుగోలు చేశాడు.. ఆ ప్రసాదంను ఆలయ ప్రాంగణంలో కూర్చొని తింటుండగా మధ్యలో ఏదో తగినట్లు కన్పించడంతో షాక్ అయ్యాడు.. ఏంటా అని చూడగా అందులో చికెన్ బొక్క ఉన్నట్లు తెలుసుకొని…