నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగాడు.. ఈ మధ్య ట్రిపుల్ ఆర్ సినిమా తో గ్లోబల్ స్టార్ అయ్యాడు.. ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ క్రేజ్ దేశవిదేశాలకు విస్తరించింది. భారీ సంఖ్యలో ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. అయితే ఎన్టీఆర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది.. అతనికి ఇలాంటి టాలెంట్ కూడా ఉందా అని ఆయన ఫ్యాన్స్ సంతోష పడతారు..
ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర మూవీతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఈ చిత్రంలో దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సైఫ్ అలీ ఖాన్, రమ్యకృష్ణ, చైత్ర రాయ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.. అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నారు..
ఎన్.టి.ఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో దేవర చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవర పార్ట్ 1 ఈ ఏడాది చివర్లో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అలాగే బాలివుడ్ లో వార్ 2 సినిమా లో నటిస్తున్నాడు.. ఇకపోతే ఆయనలో మరొక స్పెషల్ టాలెంట్ కూడా ఉంది. ఆయన బ్యాడ్మింటన్ అద్భుతంగా ఆడతారట. ఎన్టీఆర్ క్రికెట్ ఆడతారనే సంగతి తెలిసిందే. కానీ ఆయనకు బ్యాడ్మింటన్ కూడా వచ్చట. ప్రొఫెషనల్స్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఎన్టీఆర్ బ్యాడ్మింటన్ ఆడతాడట.. ఈ విషయం చాలా మందికి తెలియదు..