సంగారెడ్డి జిల్లాలోని కంకోల్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)ని దసరా నాటికి పూర్తి చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం మునిపల్లి మండలం కంకోల్‌లో పిహెచ్‌సికి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడుతూ.. 8నెలల్లో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని నియమించి పిహెచ్‌సిని నిర్వహిస్తామన్నారు. అందోలు నియోజకవర్గం పరిధిలోని మునిపల్లి మండలంలో పర్యటించిన మంత్రి పెద్ద చెల్మడ గ్రామంలో రూ.4.35 కోట్లతో నూతన జిల్లా…
రాష్ట్ర అసెంబ్లీలో శనివారం ప్రవేశపెట్టిన ఈ ఏడాది బడ్జెట్‌లో మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ కేటాయింపులు చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 2024-25 బడ్జెట్‌లో రూ.4,000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ బడ్జెట్‌లో కేవలం రూ.2,200 కోట్లు కేటాయించిందని హరీష్ రావు గుర్తు చేశారు. ఆదివారం సిద్దిపేట నుంచి ఉమ్రా యాత్రకు వెళ్తున్న ముస్లింలకు హరీష్ రావు పంపిణీ చేస్తూ.. తన సొంత ఖర్చులతో ఏటా 10 మంది పేద ముస్లింలను…
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగిని ఎలుకలు కొరికిన ఘటన సంచలనం రేపింది. రోగి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) లో చికిత్స పొందుతున్నాడు. కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జనరల్ ఆస్పత్రిలో ఐసీయూలో ఉంచిన షేక్ ముజీబ్ చేతులు, కాళ్లపై ఎలుకలు కొరికాయి. రక్తపోటు సంబంధిత సమస్యలతో వారం రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఎలుకలు కుట్టడంతో చేతులు, కాళ్ల నుంచి రక్తం కారుతున్నట్లు బంధువులు…
అయోధ్య రామాలయాన్ని బీజేపీ రాజకీయం చేస్తుందన్నారు బీఆర్ఎస్ రాజ్యసభ పక్ష నేత కే కేశవరావు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాముడిని రాజకీయం చేశారని, ప్రజా సమస్యలు పక్కన పెట్టి అయోధ్య గురించి పార్లమెంట్ లో చర్చ పెట్టి తీర్మానం చేశారన్నారు. అయోధ్య రామాలయంపై పార్లమెంట్ లో తీర్మనం చేయడం తప్పు.. వ్యతిరేకిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. కానీ సభాపతి అధికారం ఉంటుంది కాబట్టి చేశారని ఆయన అన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రామలయాన్ని రాజకీయం చేస్తున్నారని,…
HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల వ్యవహారంపై ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తోంది. కస్టడీ విచారణ సమయంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి పేరును శివబాలకృష్ణ చెప్పడంతో.. ఆయనను విచారించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. న్యాయ సలహాతో నోటీసులు జారీ చేసి విచారించడానికి సిద్ధమవుతోంది ఏసీబీ. 161 కింద నోటీసులు ఇచ్చి వివరాలు సేకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. బాలకృష్ణ దగ్గర దొరికిన ల్యాబ్‌టాప్, సెల్‌ఫోన్లు అనాలసిస్ చేస్తున్న ఏసీబీ.. శివ బాలకృష్ణ, ఐఏఎస్ అరవింద్‌ల…
ఫిబ్రవరి 14వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య జన్మదినమని, దామోదర్ సంజీవయ్య ట్రస్ట్ చైర్మన్ గా సంజీవయ్య జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానన్నారు మాజీ ఎంపీ వి హనుమంతరావు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్న దామోదర సంజీవయ్య జన్మదిన కార్యక్రమానికి హాజరు కావాలన్నారు వీహెచ్. 13వ తేదీన రైతులు ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్నారని, ఆందోళన రెండు రోజుల ముందే ఢిల్లీలోకి రైతులు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు…
రాష్ట్రంలో భారీగా ఎంపీడీఓల బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే.. నిన్న డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఎంపీడీఓలను బదిలీ చేసింది. ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ పరిధిలో సేవలందిస్తున్న 395 మంది ఎంపీడీవోలను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సొంత జిల్లాల్లో పని చేస్తున్న వారితో పాటు మూడేళ్లకుపైగా ఒకేచోట పని చేస్తున్న ఉద్యోగులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని గతేడాది డిసెంబర్‌లో ఎన్నికల కమిషన్ ఆదేశించింది.…
1. నల్లగొండ పట్టణం పాతబస్తీ హనుమాన్ నగర్ శ్రీ అభయాంజనేయ స్వామి వారి ప్రతిష్ట మహోత్సవనికీ హాజరైన కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. స్వామి వారి పూజకార్యక్రమం లో పాల్గొనున్న కిషన్ రెడ్డి..
వైసీపీ అధినేత, సీఎం జగన్ ఆదేశాల మేరకు వివిధ రీజనల్ కో-ఆర్డినేటర్లకు పార్లమెంట్ నియోజకవర్గాలు, జిల్లాల బాధ్యతలను వైసీపీ అధిష్ఠానం అప్పగించింది. ఒంగోలు పార్లమెంట్, ఉమ్మడి నెల్లూరు జిల్లాల కోఆర్డినేటర్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించగా.. విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా మల్లాది విష్ణును నియమించారు.
ఈ మధ్య పలు సినిమాల్లో కమెడియన్ చేసిన చాలా మంది ఇప్పుడు హీరోగా చేస్తున్నారు.. అందులో కొందరు భారీ సక్సెస్ ను కూడా తమ ఖాతాలో వేసుకున్నారు.. ఇప్పుడు మరో కమెడియన్ హీరోగా తనలోని షెడ్స్ ను చూపించడానికి వచ్చేస్తున్నాడు.. అతను ఎవరో కాదు అభినవ్ గోమఠం.. కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న అభినవ్ గోమఠం హీరోగా నటిస్తున్న చిత్రం ‘మస్త్ షేడ్స్ ఉన్నయ్ రా’. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం…