కృష్ణా జిల్లాలోని గుడివాడలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీగా మైనార్టీలు చేరారు. ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో , వైయస్ఆర్సీపీలో 500 మంది టీడీపీకి మైనార్టీలు జాయిన్ అయ్యారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి బిజెపి అభ్యర్ధిగా ఈటల రాజేందర్ పేరును అధినాయకత్వం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈటలకి అభిమానుల తాకిడి ఎక్కువ అయ్యింది. బీజేపీ నేతలు, కార్యకర్తలు, ఈటల అభిమానులతో షామీర్ పేటలోని ఈటల నివాసం సందడిగా మారింది. పెద్ద ఎత్తున తరలివచ్చి అభినందనలు తెలిపారు. ఈ సారి గెలుపు మీదే అంటూ భరోసా ఇచ్చారు. శాలువాలు కప్పి సత్కరించారు. మోదీ గారినీ ప్రధానమంత్రిని చేసేందుకు మల్కాజ్గిరి నుండి ఈటలను గెలిపించే…
బీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే.. ఈ నేపథ్యంలో మేడిగడ్డ పిల్లర్ ఘటన దీనికి మరింత బలాన్ని చేకూర్చుతుండగా.. కాళేశ్వరం నిర్మాణంపై విచారణ జరపాలని బీజేపీ సైతం కోరుతోంది. ఈ క్రమంలోనే.. 6వ తేదీన కాళేశ్వరం పరిశీలనకు నిపుణుల కమిటీ రానున్నట్లు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిపుణుల కమిటీ రాకను స్వాగతిస్తున్నాం.. అన్ని రకాలుగా సహకరిస్తామన్నారు. నేషనల్ డ్యామ్…
ఖజానా కార్యాలయాల్లో ఆమోదం పొంది ఆర్థిక శాఖ వద్ద రెండేళ్ళుగా పెండింగులో ఉన్న మెడికల్ రీయింబర్స్ మెంట్, జిపిఎఫ్, టిఎస్ జిఎల్ఐ, పిఆర్సీ, డిఎ బకాయిలు, సప్లిమెంటరీ జీతాలు, పెన్షన్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. టిఎస్ యుటిఎఫ్ ఆఫీస్ బేరర్స్ సమావేశం ఆదివారం రాష్ట్ర కార్యాలయంలో కె జంగయ్య అధ్యక్షతన జరిగింది. గత ఆర్థిక సంవత్సరానికి చెందిన బిల్లులు మంజూరు…
ప్రధాని మోడీ రేపు, ఎల్లుండి తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే.. ప్రధాని మోడీకి తెలంగాణ పర్యటనకు సంబంధించి షెడ్యూల్‌ను బీజేపీ విడుదల చేసింది. రేపు ఉదయం 10.30 నుండి 11 గంటల వరకు అదిలాబాద్‌లో పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ లకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవం లో పాల్గొననున్న మోడీ….11.15 గంటల నుండి 12 గంటల వరకు పబ్లిక్ మీటింగ్ ప్రధాని మోడీ పాల్గొంటారు. మధ్యాహ్నం తమిళ్ నాడు వెళ్లి.. తిరిగి రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. రేపు రాత్రి రాజ్…
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం నీరుగుట్టివారిపల్లెలో ఓ కుమారుడు తన తల్లిదండ్రుల పట్ల పశువులా ప్రవర్తించాడు. తల్లిదండ్రులపై పట్ల మానవత్వం లేకుండా ఆ కొడుకు మృగంలా వ్యవహరించాడు. ఆస్తికోసం నడిరోడ్డుపై తల్లిదండ్రులను ఆ కసాయి కొడుకు చితకబాదాడు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను ఖరారు చేసే పనిలో పడ్డారు ఆయా పార్టీల అధిష్టానం పెద్దలు. నిన్న బీజేపీ అధిష్టానం 195 స్థానాలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. దీంతో పాటు.. తెలంగాణలోనూ పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఫైనల్ చేస్తూ పేర్లను ప్రకటించింది. అయితే.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో సీట్లు గెలిచేందుకు బీఆర్‌ఎస్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో…
చిత్తూరు జిల్లాలో కీలకమైన రాజకీయాలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. చిత్తూరు నియోజక వర్గం వైసీపీ ఎమ్మెల్యే ఆరిణి శ్రీనివాసులు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు.