రవీంద్రభారతిలో దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, హాజరైన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్రపటానికి నివాళులు అర్పించారు సీఎం, మంత్రులు. రవీంద్రభారతి ఆవరణలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు ఫోటో ఎగ్జిబిషన్…
ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా మరో గ్యారెంటీ పై ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. ఇందిరమ్మ ఇండ్ల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇండ్లు లేని వారికి ఇంటి స్థలం, 5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం పై కసరత్తు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు ఇండ్లు లేని నిరుపేదలు ఎంతమంది ఉన్నారో.. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వివరాలు తెలుసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో…
రాష్ట్రoలోని ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాల కోసం ముడి పామాయిల్ ధరలు స్థిరీకరించానికి ముడి పామాయిల్ దిగుమతి పై సుంకాలని విధించి పామాయిల్ గెలలకు లాభదాయకమైన ధరలను ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ ద్వారా కోరడం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించడానికి భారత ప్రభుత్వం 1992 నుండి వివిధ కార్యక్రమాల ద్వారా ఆయిల్ పామ్ సాగు అభివృద్దిని ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతము, రాష్ట్రంలో ఆయిల్ పామ్…
యాదాద్రి కాదు ఇకపై యాదగిరి గుట్టనే అని వెల్లడించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్బంగా యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మారుస్తూ త్వరలోనే జీఓ ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్ తండ్రి చాటు కొడుకు అంటూ సెటైర్లు వేశారు కోమటిరెడ్డి. నేను ఉద్యమాలు చేసి వచ్చానని, నాలెడ్జ్ లేని కేటీఆర్ గురించి మాట్లాడడం వేస్ట్ అంటూ చురకలు అంటించారు. Nitish Kumar: “ప్రధాని మోడీని…
అల్లరి నరేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఈరోజు మధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు..నాంది సినిమాతో యాక్షన్ హీరోగా మారిపోయాడు. సీరియస్ లుక్ తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం సినిమా కూడా అదే జానర్ లో చేశారు. రీసెంట్ గా నాగార్జునతో కలిసి నా సామిరంగ సినిమా చేశాడు. సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఇప్పుడు అల్లరి నరేష్ 61…
తెలుగులో సూపర్ హిట్ ను అందుకున్న సినిమా ‘హిట్ ‘.. సినిమాతో దర్శకుడిగా తన కెరీర్ను ప్రారంభించాడు శైలేష్. అదే తరహాలో ‘హిట్వర్స్’ అని ఒక యూనివర్స్ను ప్లాన్ చేస్తున్నానని, అందులో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయని ప్రకటించాడు. తను చెప్పినట్టుగానే ఇప్పటికీ ‘హిట్వర్స్’లో రెండు సినిమాలు వచ్చాయి. మూడో సినిమా నానితో ఉంటుందని కూడా రివీల్ చేశారు. కానీ ఇంతలోనే ‘హిట్ 3’ మేకింగ్లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యిందనే గుసగుసలు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్నాయి..…
గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి సాంకేతిక విద్యను అందించేందుకు ఏర్పాటుచేసిన ఆర్జీయూకేటీ బాసర ఆశయం నెరవేరుతుంది. ఇక్కడ విద్యార్థులుగా చేర్చే తల్లితండ్రులు చిన్న, సన్న కారు రైతులుగా, కూలి పనులు, గుమాస్తాలు, చిరు ఉద్యోగాలు చేసుకుంటూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదివి చదివించుకున్న వారే. పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి బాసర క్యాంపస్ లో సీట్లు దక్కించుకొని ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి చదువు…
కాళేశ్వరం పై ఆ రెండు పార్టీలు డ్రామా చేస్తున్నాయంటూ విమర్శలు గుప్పించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇవాళ ఆయన ఆదిలాబాద్ లో ఎన్టీవీతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు వద్దకు వారు పిక్ నిక్ కు వెల్తున్నారు..పోటీ పడి ఎమ్మెల్యేలను తీసుకోని టూర్లు వేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. వాళ్లంతా డ్రామా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిపై ఒక్క లేఖ ఇస్తే సీబీఐ రంగంలోకి దిగుతుందని, సీబీఐకి ఇవ్వండి ..ఎవ్వరి చిత్తశుద్ది ఏంటో బయటపడుతుంది…దోషులు ఎవ్వరో తేలుస్తారన్నారు.…
ప్రస్తుతం టాలివుడ్ లో శ్రీలీల పేరుకు యమ క్రేజ్ ఉంది.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. అతి తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా టాక్ ను సొంతం చేసుకుంది..తన టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతుండటంతో ఈ బ్యూటీ కెరీర్ దూసుకుపోతోంది.. రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించిందో లేదో ఈ ముద్దుగుమ్మ టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీలా భరత నాట్యం చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..…
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తాగునీటి వనరులైనటువంటి రిజర్వాయర్ల వారీగా ప్రస్తుతం ఉన్న నీటి నిలువలపై సమక్షించారు. రిజర్వాయర్లు, నదుల వంటి తాగునీటి వనరుల స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్రంలోని అన్ని మారుమూల గ్రామాలు, ఆవాసాలు, తండాలు, గుడాలకు ప్రతిరోజు తాగునీటి సరఫరా జరిగేలా చూడాలని మంత్రి ఇంజనీర్లను ఆదేశించారు. ప్రత్యేకంగా పూర్వపు అదిలాబాద్, కరీంనగర్ జిల్లాలోని పంపుసెట్ల సమస్యను త్వరితంగా పరిష్కరించి వేసవిలో ఎటువంటి…