వరల్డ్ కిడ్ని డేను పురస్కరించుకుని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని స్టార్ హాస్పిటల్స్‌లో ప్రపంచ కిడ్నీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం అందించే స్టార్ సెలబ్రిటీ అవార్డులను కిడ్నీ మార్పిడి చేయించుకుని ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన వారికి ప్రదానం చేశారు.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంటలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ వట్టిమాటలు చెబుతున్నదన్న నేతలకు మా పథకాలే సమాధానమని వ్యాఖ్యానించారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జ్ బుట్టా రేణుకపై తీవ్రంగా మండిపడ్డారు టీడీపీ నేత మాచాని సోమనాథ్. మాచాని సోమప్ప ఎక్కడైతే అభివృద్ధిని వదిలేసారో.. వాటన్నిటిని ముందుకు తీసుకెళ్తానని, చేనేత అభివృద్ధికి పాటుపడుతానని ఇటీవల చేనేత ఆత్మీయ సమ్మేళన సభలో బుట్టా రేణుక చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు.
టీడీపీ ఇటీవల 94 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ చంద్రబాబు మాట్లాడుతూ, వీలైనంత మంది టీడీపీ అభ్యర్థులతో రెండో జాబితాను రేపు ప్రకటిస్తామని వెల్లడించారు. టీడీపీ అభ్యర్థుల జాబితా కసరత్తులు తుది దశకు చేరుకున్నాయని ఆయన వెల్లడించారు.
వెనకబడిన కులాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కొత్త కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. కొత్త కార్పొరేషన్‌లకు నిధులు ఇచ్చి అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
ఇంటింటికి మంచి నీటి కుళాయిలు అందిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఇవన్నీ మహిళల కోసం ప్రవేశ పెట్టాం.. ఇప్పుడు విద్యార్ధినుల కోసం కలలకు రెక్కలు పేరుతో మరో పథకం ప్రవేశపెట్టాం.. పేద విద్యార్థినులు కలల సాకారం చేసుకోవాలంటే ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి.. విద్యార్ధినుల ఉన్నత చదువుల కోసం బ్యాంక్ లోన్లు తీసుకునేలా మేం సహకరిస్తామన్నారు.
సినిమా ఒక రంగుల ప్రపంచం ఒక్కసారి ఛాన్స్ వస్తే చాలు అనుకుంటే సరిపోదు.. అదృష్టం కూడా ఉండాలి అప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు.. కేరీర్ మొదట్లో అవకాశాలు లేకపోయినా సెకండ్స్ ఇన్నింగ్స్ లో కొందరు హీరోయిన్లు అదరగొడుతున్నారు.. అలాంటి వారు ఇప్పుడు చాలా మందే ఉన్నారు.. సినిమా కోసం మాత్రమే కాదు తమ వ్యక్తిగత జీవితంలో కూడా వారు ఫిట్నెస్ పై ఫోకస్ చేసిన విధానం వారికి మంచి స్థానాన్ని అందిస్తుంది.. అందులో ముందువరుస ప్రియమణి, జ్యోతిక ఉన్నారు..…
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువతి గుర్రం మొఖం కలిగిన ఓ మాస్క్ ధరించి ఆ గుర్రం దగ్గరకు వెళ్లింది. ఇంకేముంది పాపం ఆ గుర్రం.. తన దెగ్గరికి నిజమైన గుర్రం వచ్చిందని రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లింది. అదే ఆవేశం, ఉత్సుకత తో ఆ మాస్క్ పై ముద్దు పెట్టింది. ఆ తర్వాత మాస్క్ ధరించిన మహిళ తన మాస్క్ ను బయటకు తీయడంతో.. ఒక్కసారిగా ఆ గుర్రం షాకైంది. దాంతో వెంటనే…
చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలనే సామేత అందరికి తెలుసు.. ఒకప్పుడు స్టార్ హోదాలో వారు ఇప్పుడు సరైన అవకాశాలు లేక దీన స్థితిలో ఉన్నారు.. కొందరు సీరియల్స్ లో నటిస్తే మరికొందరి పరిస్థితి దారుణంగా ఉందని చెప్పాలి.. ఈ లిస్టులో షాపింగ్ మాల్ హీరో కూడా ఉన్నాడు.. ప్రస్తుతం అవకాశాలు లేక దారుణ స్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది.. ఈ షాపింగ్ మాల్ సినిమా 2010 మార్చ్…
వెన్నెల కిషోర్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. స్టార్ కమెడియన్ గా బాగా పాపులర్ అయ్యాడు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు.. ఇప్పుడు హీరోగా ఓ సినిమాలో నటించాడు.. చారి 111 మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. చారి 111 మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పదిహేను రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం.. అక్కడ ఆశించిన రిజల్ట్ ను అందుకోలేక పోయింది.. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను…