విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితమే.. తెలుగులో ఆయన సినిమాలు డబ్ అయ్యాయి.. దాంతో ఇక్కడ కూడా ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు.. తమిళ్ స్టార్ హీరోలు పాటలు పాడతారు.. కమలహాసన్, విజయ్, శింబు, ధనుష్ వంటి వారు పాడిన పాటలు ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందాయి.. ఇప్పుడు విజయ్ సేతుపతి కూడా తనలోని టాలెంట్ ను బయటపెట్టారు.. విజయ్‌సేతుపతి కూడా పాడడం మొదలెట్టారు. ఈయన ‘కరా’ అనే…
పిల్లి కారణంగా జపాన్‌లోని ఓ నగరం అప్రమత్తమైంది. జపాన్‌లోని ఒక మహానగరమైన పుకుయామా వణికిపోతోంది. ఏం వార్త వినాల్సి వస్తోందోనని జనం హడలెత్తిపోతున్నారు. కారణమేమిటంటే.. ఆ పిల్లి ప్రమాదకరమైన రసాయనాల ట్యాంక్‌లో పడి అక్కడి నుంచి కనిపించకుండాపోవడమే.
సంక్రాంతికి సినిమాల సందడి ఏ విధంగా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇక సమ్మర్ కు కూడా ఎక్కువగానే సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.. ఈ సమ్మర్ లో కాస్త ఎక్కువగానే సినిమాలు విడుదల కాబోతున్నాయని తెలుస్తుంది.. గత వారం వచ్చిన సినిమాల్లో గామి, ప్రేమలు మంచి విజయం సాధించి థియేటర్స్ లో దూసుకుపోతున్నాయి. ఇక ఈ వారం మాత్రం అన్ని చిన్న సినిమాలే ఉన్నాయి. ఒకేసారి ఏకంగా 10 సినిమాల వరకు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి.. అవేంటో ఒక…
Bode Prasad : ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. అంతేకాకుండా.. ఈ పొత్తులోకి బీజేపీ కూడా వచ్చి చేరడంతో కూటమిగా మారింది. అయితే.. ఇటీవల కూటమిలో పార్టీల మధ్య సీట్ల పంపకాలపై తుది నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయా పార్టీల అధిష్టానాలు అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. అయితే.. ఇటీవల కాలంలో నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలను, ప్రజల్లో ఉంటున్న నాయకులకు టిక్కెట్లు ఇవ్వకుండా.. వారిని మరో…
ఏపీ సీఎం జగన్ నేడు నంద్యాల జిల్లాలో పర్యటించారు. మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా నిధుల విడుదల చేశారు సీఎం జగన్. మహిళా సాధికారత సామాజిక న్యాయానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని, ఆర్థిక అనివార్యత కూడా అనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన ఓసీ వర్గాల మహిళలకు ఈబీసీ నేస్తం ద్వారా ఆర్ధిక సాయం చేస్తోంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పేదరికానికి కులం ఉండదన్నారు.…
ఈమధ్య పలు కంపెనిల్లో ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.. ఎన్నో వందల కంపెనీలు వేల మంది ఉద్యోగులను తొలగించారు.. ఇప్పుడు అదే కోవలోకి ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ పేటీఎం కూడా చేరింది.. భారీగా తమ ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నారు.. కంపెనీ ఉద్యోగుల్లో 20 శాతం మందిని తొలగించవచ్చునని తెలుస్తుంది.. మార్చి 15 నుండి వ్యాపారాలు నిర్వహించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను రిజర్వ్ బ్యాంక్ నిషేధించిన తర్వాత ఈ చర్య…
ఈ మధ్య థియేటర్ లలో సక్సెస్ అవ్వని సినిమాలు ఓటీటీలో మంచి హిట్ ను సొంతం చేసుకుంటున్నాయి.. ఈమధ్య ఓటీటీలో సినిమా సందడి ఎక్కువగానే ఉంటుంది.. అలా గతేడాది థియేటర్లలో విడుదలై పెద్దగా మెప్పించని ఒక యూత్ ఫుల్ ప్రేమ కథా చిత్రం ఓటీటీలో సందడి చేయనుంది.. ఆ సినిమానే ఏం చేస్తున్నావ్.. భరత్ మిత్ర తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో దాదాపు అందరూ కొత్త వాళ్లే నటించారు. విజయ్ రాజ్‌కుమార్, నేహా…
టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాపై ఉత్కంఠ నెలకొంది. 94 మంది అభ్యర్థులతో గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించింది. కానీ కొంతమంది సీనియర్లు వారి భవిష్యత్తుపై అనేక ప్రశ్నలను లేవనెత్తే జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. కూటమి పార్టీల నేతల మధ్య పోటీ కూడా ఇందుకు ప్రధాన కారణం. ఇప్పుడు టీడీపీ 34 మంది అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఎవరనే దానిపై మరింత క్లారిటీ వచ్చింది. సస్పెన్షన్‌కు గురైన…
కృష్ణాజిల్లా గుడివాడలో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చేశారు. బౌద్ధ విధానంలో ఎమ్మెల్యే కొడాలి నాని, ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ.. అంబేద్కర్ దిక్సూచిగానే వైఎస్సార్సీపీ పని చేస్తుందని ఆయన తెలిపారు. గుడివాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహా ఏర్పాటుకు శంకుస్థాపన చేసే మహాభాగ్యం తనకు రావడం పూర్వజన్మ సుకృతమని…