ఈమధ్య పలు కంపెనిల్లో ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.. ఎన్నో వందల కంపెనీలు వేల మంది ఉద్యోగులను తొలగించారు.. ఇప్పుడు అదే కోవలోకి ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ పేటీఎం కూడా చేరింది.. భారీగా తమ ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నారు.. కంపెనీ ఉద్యోగుల్లో 20 శాతం మందిని తొలగించవచ్చునని తెలుస్తుంది..
మార్చి 15 నుండి వ్యాపారాలు నిర్వహించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను రిజర్వ్ బ్యాంక్ నిషేధించిన తర్వాత ఈ చర్య జరిగింది. మని కంట్రోల్ నివేదిక ప్రకారం, కొన్ని విభాగాలు టీం సైజ్ 20% చెయ్యాలనే నిర్ణయించారు.. పర్ఫార్మెన్స్ బేస్డ్ ఉద్యోగ కోతలు పై ఎంత మంది అని సమాచారం ఇవ్వలేదు. పర్ఫార్మెన్స్ కాకుండా కృత్రిమ మేధస్సుతో నడిచే ఆటోమేషన్ వైపు కంపెనీ దృష్టి సారించడంతో చాలా మంది ఉద్యోగులను బయటకు పంపవచ్చు అని తెలుస్తుంది.. మా అన్యువల్ అప్రయ్జల్ సైకిల్ మధ్యలో ఉన్నాము..
కంపెనీల అంతటా ఒక కామన్ ప్రాక్టీస్, ఇక్కడ పర్ఫార్మెన్స్ అంచనాలు పర్ఫార్మెన్స్ మూల్యాంకనాలు ఇంకా సర్దుబాట్లకు దారితీయవచ్చు. ఈ ప్రక్రియ తొలగింపుల నుండి భిన్నంగా ఉంటుందని అర్థం చేసుకోవడం చాలా కీలకం, ఏదైనా సంస్థలో పర్ఫార్మెన్స్ ఎవాల్యువేషన్ సాధారణ అంశం అని ఆ కంపెనీ అధినేత తెలిపారు.. అయితే కంపెనీ ఆర్థిక వ్యవహారాలను బట్టి మళ్లీ ఉద్యోగులను తీసుకోవచ్చు అని ఆయన తెలిపారు..