ఈ మధ్య థియేటర్ లలో సక్సెస్ అవ్వని సినిమాలు ఓటీటీలో మంచి హిట్ ను సొంతం చేసుకుంటున్నాయి.. ఈమధ్య ఓటీటీలో సినిమా సందడి ఎక్కువగానే ఉంటుంది.. అలా గతేడాది థియేటర్లలో విడుదలై పెద్దగా మెప్పించని ఒక యూత్ ఫుల్ ప్రేమ కథా చిత్రం ఓటీటీలో సందడి చేయనుంది.. ఆ సినిమానే ఏం చేస్తున్నావ్.. భరత్ మిత్ర తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో దాదాపు అందరూ కొత్త వాళ్లే నటించారు. విజయ్ రాజ్‌కుమార్, నేహా పటానీ హీరో హీరోయిన్లుగా నటించారు.
అమిత రంగనాథ్, ఆమని, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గతేడాది ఆగస్టు 25న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు.. అసలు ఈ సినిమాకు ప్రమోషన్స్ సరిగ్గా లేకపోవడంతో సినిమా వచ్చింది కూడా పెద్దగా తెలియదు.. దాంతో సినిమా పెద్దగా ఆడలేదు.. ఇప్పుడీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ ఈ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మార్చి 28 నుంచి ఏం చేస్తున్నావ్ ను ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు ఈటీవీ విన్ అధికారికంగా ప్రకటించింది.
ఇక ఈ సినిమాకు నవీన్ కురవ, కిరణ్ కురవ సంయుక్తంగా ఏం చేస్తున్నావ్ ను నిర్మించారు. గోపి సుందర్ స్వరాలు సమకూర్చారు. ప్రేమ్ అడివి టోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే హరీష్ శంకర్ టి ఎన్ ఎడిటర్ గా వ్యవహరించారు. కాగా మొదట ఈ మూవీను గురువారం అంటే మార్చి 14నుంచే ఓటీటీలోకి తీసుకురానున్నట్లు వచ్చాయి. ఇక్కడ ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి…
ఏం చేస్తున్నావ్? 🤭😂 One Question many replys😁😅
Get ready for an an Youthful Family Entertainer!!🤩Premieres March 28
Only on EtvWin pic.twitter.com/W8HezbvSE3— ETV Win (@etvwin) March 13, 2024