తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి సుబ్రమణ్య మైదానంలో ఎంపీ మార్గాని భరత్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. రాజమండ్రిలో ఇవాళ ఒకేరోజు 25వేల ఇళ్ల పట్టాల పంపిణీ చేసి చరిత్ర సృష్టించామన్నారు. సీఎం జగన్ ఒకేరోజు 25వేల ఇళ్ల పట్టాల కోసమని 300 కోట్లు విడుదల చేశారన్నారు మార్గాని భరత్. ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లకపోతే రాజమండ్రిలో పట్టాల…
నేడు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. నిన్న రాత్రి ముద్రగడ పద్మనాభం కిర్లంపూడి నుంచి బయలుదేరి విజయవాడకు చేరుకున్నారు. ఈరోజు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీలో ముద్రగడ పద్మనాభం చేరనున్నారు. సుదీర్ఘకాలం తర్వాత ఆయన పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటి వరకూ ఆయన కాపు సామాజికవర్గం సంక్షేమం కోసం అన్ని రాజకీయ పార్టీలకూ దూరంగా ఉన్నారు. అయితే ఈరోజు ఆయన వైసీపీలో చేరుతుండటంతో సుదీర్ఘకాలం తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి…
రాష్ట్రాన్ని వైసీపీ కబంద హస్తాల నుంచి కాపాడాలంటే అది టీడీపీ-జనసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు . విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన పార్టీ కార్యాలయాన్ని గురువారం యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు.
టర్కీ నుంచి కొనుగోలు చేసిన డ్రోన్లతో నిఘా ప్రారంభించినట్లు మాల్దీవుల జాతీయ రక్షణ దళం (ఎంఎన్‌డీఎఫ్) తెలిపింది. టర్కీతో ఒప్పందం ప్రకారం కొనుగోలు చేసిన డ్రోన్ విమానాన్ని చూపే వీడియోను కూడా ఎంఎన్‌డీఎఫ్ షేర్ చేసింది.
బీహార్‌లో శాసన మండలి ఎన్నికల్లో ఓటింగ్ జరగకుండానే మొత్తం 11 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనమండలిలో 11 స్థానాలు ఖాళీ కాగా.. ఇందులో, ఎన్‌డీఏకు చెందిన ఆరుగురు అభ్యర్థులు, మహాకూటమికి చెందిన ఐదుగురు అభ్యర్థులు మినహా.. 12వ పోటీదారు ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. ఈ క్రమంలో అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఒకప్పుడు కట్టెల పొయ్యిమీద మట్టి కుండల్లో ఎక్కువగా అన్నం వండుకొని తినేవారు. అందుకే అందరు ఎటువంటి రోగాలు లేకుండా చాలా ఆరోగ్యం ఉండేవారు.. రాను రాను టెక్నాలజీ పెరిగిపోవడంతో కుక్కర్ లు అందుబాటులోకి వచ్చాయి.. ఇప్పుడు కరెంట్ రైస్ కుక్కర్ లు అందుబాటులోకి వచ్చాయి.. ప్రతి ఇంట్లో రైస్ కుక్కర్ ఉంటుంది. అందులో బియ్యం వేస్తే క్షణాల్లో అన్నం అవుతుంది..ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లను వినియోగిస్తే గంజిలోని పోషకాలు కూడా శరీరానికి లభిస్తాయని చాలామంది ఫీలవుతారు.. పోషకాలు మాట…
ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి దళిత మహిళను పెళ్లి చేసుకునేందుకు తన గుర్తింపును దాచిపెట్టినందుకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తబ్రేజ్ ఆలం అనే నిందితుడు తన పేరును ఆర్యన్ ప్రసాద్‌గా మార్చుకుని గోరఖ్‌పూర్‌లో పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నట్లు ఆ మహిళకు అబద్ధం చెప్పాడు.
ఏపీ ఈసెట్ 2024 నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.. జేఎన్‌టియూ అనంతపురం ఆధ్వర్యంలో ఈ ఈసెట్ పరీక్షలను నిర్వహించనున్నారు.. రాష్ట్రంలోని సెట్ల నిర్వహణ షెడ్యూల్‌ను ఇప్పటికే ఏపీ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. తాజాగా ఈసెట్ 2024 నోటిఫికేషన్‌ను ఈసెట్ కన్వీనర్ విడుదల చేశారు.. ఈసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ మార్చి 15 నుంచి ప్రారంభంకానుంది. ఎలాంటి దరఖాస్తు రుసుము లేకుండా ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.. ఈ పరీక్షల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..…
మనోహర్ లాల్ ఖట్టర్ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ వరకు.. త్రివేంద్ర సింగ్ రావత్ నుంచి బసవరాజ్ బొమ్మై వరకు బీజేపీ మాజీ ముఖ్యమంత్రులు, రాష్ట్ర పెద్దలను లోక్సభ ఎన్నికలలో పోటీకి దింపుతోంది బీజేపీ.