ముఖ్యమంత్రి సహాయనిధి ( సీఎంఆర్‌ఎఫ్ ) చెక్కులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు కార్యాలయం తన ప్రమేయాన్ని ఖండించింది. తనకు సంబంధం ఉన్న వ్యక్తుల ద్వారా చెక్కులను క్యాష్ చేశారనే వార్తలపై హరీష్ రావు కార్యాలయం స్పందిస్తూ, నిందితుడు నరేష్‌కు మాజీ మంత్రితో ప్రత్యక్ష సంబంధం లేదని స్పష్టం చేసింది. డిసెంబర్ 6, 2023న తన మంత్రి క్యాంపు కార్యాలయం కార్యకలాపాలు నిలిపివేసినట్లు హరీష్ రావు కార్యాలయం ఒక…
జనసేన శ్రేణులు పొత్తు ధర్మాన్ని గౌరవిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఎవరైనా పొత్తు ధర్మానికి భిన్నంగా.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎక్కడా పొరపాట్లకు, లోటుపాట్లకు తావివ్వకుండా మూడు పార్టీలూ క్షేత్ర స్థాయి నుంచి ముందుకు వెళ్ళాలని సూచించారు.
ప్రభుత్వం మొత్తం 614 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇఛ్చింది. 555 అభ్యర్థులు సెలెక్టయ్యారు. ఫిబ్రవరి 14న ఎంపికైన ఎక్సైజ్ కానిస్టేబుళ్ల కు ప్రభుత్వం అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇచ్చింది. ఏప్రిల్ 13వ తేదీ వరకు జాయినింగ్ టైమ్ ఇచ్చింది. సెలెక్టయిన 555 మంది అభ్యర్థుల్లో ఇప్పటివరకు 397 మంది జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. వీరందరూ 3 నెలల పాటు శిక్షణ పొందాల్సి ఉంటుంది. 45 రోజులు ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. 120 మంది అభ్యర్థులకు ఎక్సైజ్…
ప్రొద్దుటూరు సభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం దద్దరిల్లింది. ప్రొద్దుటూరులో ఈ రోజు ఒక మహా సముద్రం కనిపిస్తుంది అంటూ ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇంతటి మహా సైన్యం మధ్య మన ప్రజా జైత్ర యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా తల ఎత్తుకుని రెపరెపలాడుతుందన్నారు.
మార్చి నెల ముగిసిపోయింది.. మరో మూడు రోజుల్లో ఏప్రిల్ నెల రాబోతుంది.. అలాగే మార్చి 31 కి గత ఏడాది ఆర్థిక సంవత్సరం కూడా ముగిసిపోతుంది.. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది.. ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి.. అదేవిధంగా ఏప్రిల్ లో కూడా సెలవులు ఉన్నాయి.. తాజాగా ఆ వివరాలను రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది.. ఆ నెలలో ఏకంగా 14 రోజులు సెలవులు ఉన్నాయని తెలుస్తుంది.. ఆ లిస్ట్ ను ఒకసారి చూసేద్దాం.. ఏప్రిల్ లో…
ఓ అమ్మాయి వేధింపుల వల్లే తమ కుమారుడు చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు మృతుడి బంధువులు. కరీంనగర్ శివారులోని తీగల వంతెన పై రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలానికి చెందిన రాజశేఖర్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడే ఉన్న స్థానికులు గమనించి హుటాహుటిన కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గం మద్యంలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. తన చావు కారణమైన వారిని శిక్షించాలని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు.…
తెలంగాణలో ఈసారి బీజేపీ మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకోబోతున్నదని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ సహా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొన్నారని, వారి పర్యటనల సందర్భంగా ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందని అన్నారు. ఇప్పటికే ఆయా స్థానాల్లో బలమైన అభ్యర్థులను ప్రకటించినట్లు పేర్కొన్న కిషన్ రెడ్డి.. డోర్ టు డోర్ వెళ్లి ప్రజలను కలుస్తున్నామని, రాష్ట్రంలో డబుల్ డిజిట్…
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రను మొదలుపెట్టారు. ఇప్పటివరకు మూడు నియోజకవర్గాలలో బస్సు యాత్ర ముగిసింది. తొలిరోజు వైఎస్సార్ జిల్లా కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో యాత్ర కొనసాగించింది.
లోక్‌సభ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత తెలంగాణలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) అమలులోకి వచ్చిన నేపథ్యంలో రూ.38 కోట్లకు పైగా విలువైన లెక్కల్లో చూపని నగదు, వస్తువులను లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు జప్తు చేశాయి. మార్చి 18 నుంచి 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.38,12,34,123 నగదు, మద్యం, బంగారం, వెండి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, ఫ్రీబీలు, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 9.01 కోట్ల నగదుతో పాటు రూ.8.14…
మాయానగరి ముంబైలో నిర్మించిన జియో వరల్డ్ గార్డెన్ ఎంతో ప్రసిద్ధి చెందింది. దీని యజమాని దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ. ఈ గార్డెన్ 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. చెరువులు, మాల్స్, థియేటర్లు, గార్డెన్‌లోని పచ్చదనం దాని అందాన్ని మరింత పెంచుతాయి. ఇందులో ఇప్పటికే పలు పెద్ద కార్యక్రమాలు నిర్వహించారు.