ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పొలం బాట పేరుతో రైతుల వద్దకు వెళ్తుంటే చాలా విచిత్రంగా ఉందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్రలకు పోయినట్టు ఉందని, రాష్ట్రంలో ఏనాడైనా పంటల బీమా డబ్బులు కానీ, కరువు, వరదలు వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోయిన సందర్భంగా ఏనాడైనా కేసీఆర్ రైతుల వద్దకు పోయారా అని ఆయన ప్రశ్నించారు. అధికారంపొయాక ఇప్పుడు…
ప్రకృతి వైపరీత్యాలని, వర్షాభావ పరిస్థితులను ప్రభుత్వ వైఫల్యంగా చూపాలనీ ప్రయత్నించే నీచమైన ప్రవృత్తి గల ప్రతిపక్ష నాయకులారా అంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. అందులో.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది డిసెంబర్ 7, 2023. అంటే వర్షాకాలం అయిపోయిన తరువాత. అప్పటికే నాగార్జునసాగర్ లో నీళ్లు లేని కారణంగా మొదటిపంటకే నీళ్ళివనీ మీరు, రెండో పంటకి నీళ్ళివాలని హేతుబద్దత లేని డిమాండులు చేయడం మీ దుర్భుద్దికి…
రైతుల కోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోమారు జంగ్ సైరన్ మోగించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయినా ఇప్పటి వరకు రైతులకు పరిహారం అందించకపోవడం, ప్రభుత్వ వైఫల్యంవల్ల సాగు నీరందక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోకపోవడం… పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడం, ఎన్నికల్లో రైతులకిచ్చిన ఏ ఒక్క హామీలని ఇప్పటి వరకు అమలు చేయని నేపథ్యంలో ‘రైతు దీక్ష’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా…
కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసే పార్టీ అని, కాంగ్రెస్ నాయకులని మాదిగ పల్లెలోనికి రానివ్వదు అని నేను మాదిగ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న అన్నారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ. ఇవాళ ఆయన హనుమకొండ జిల్లా హరిత హోటల్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ నుండి రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ నాయకులు ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు కోల్పోయారన్నారు. వరంగల్ లో ఎక్కువ…
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికల పర్యవేక్షణకు అయిదుగురు సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నియమించారు.
రైతులకు పంట నష్టపరిహారం అందే వరకు బీఆర్‌ఎస్ విశ్రమించేది లేదనిమాజీ సీఎం కే చంద్రశేఖరరావు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకున్నారు . కేవలం 100 రోజుల పరిపాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మేం రైతులకు అన్ని ఏర్పాట్లు చేసి పెట్టినా ఈ దుస్థితి ఎందుకొచ్చింది? దేశంలోనే ఉత్పత్తిలో నంబర్ వన్ స్థాయికి ఎదిగిన రాష్ట్రం అనతికాలంలో ఈ స్థాయికి ఎందుకు దిగజారిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతులకు తన సందేశంలో పేర్కొన్నారు.…
విపక్షంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌కి పొలంబాట పట్టాలని అర్థమైందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనం బాట మరిచిన కేసిఆర్ కు ప్రజల అజెండా ఏంటో తెలియడంలేదన్నారు. అధికారం కోల్పోయిన మూడు నెలలకే రాజకీయంగా పతనమైన తర్వాత కేసిఆర్ జనంలోకి రావాలనుకోవడం విచిత్రంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్ల తర్వాత కేసిఆర్ కు ప్రజలు గుర్తుకు వచ్చారని, అధికారంలో ఉన్నప్పుడు రైతుల ఇబ్బందులు పడ్డ సమయంలో పట్టించుకోని కేసిఆర్,…
ఏపీలో పింఛన్ల పంపిణీపై కొనసాగుతున్న సందిగ్ధతపై ఎట్టకేలకు క్లారిటీ లభించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఉండదని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) ఉత్తర్వులు జారీ చేసింది.
మోడీ పదేళ్ళ లో కులాల కొట్లాటలు తెచ్చిండని, ఉద్యోగాలు అడిగితే రాముని అక్షింతలు పంపించిండన్నారు మంత్రి సీతక్క. ఆదానీ- అంబానీ రిలయన్స్, జియో ల కోసమే బీజేపీ పనిచేస్తుందని మంత్రి సీతక్క మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు రాలే.. దేవుళ్ళ పేర్లు చెప్తున్నారు.. మన ఊర్లు అందరికి దేవుళ్ళు ఉన్నారని, గాంధీని చంపిన గాడ్సే కు మద్దతు తెలిపి పూజించే పార్టీ బీజేపీ పార్టీ అని ఆయన మండిపడ్డారు. బీజేపీ కరోనా సమయంలో ఎవరికి సహాయం చేయలేదని,…