కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసే పార్టీ అని, కాంగ్రెస్ నాయకులని మాదిగ పల్లెలోనికి రానివ్వదు అని నేను మాదిగ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న అన్నారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ. ఇవాళ ఆయన హనుమకొండ జిల్లా హరిత హోటల్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ నుండి రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ నాయకులు ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు కోల్పోయారన్నారు. వరంగల్ లో ఎక్కువ శాంతం మాదిగలు ఉన్న మాదిగలను అణిచివేస్తున్నారన్నారు మందకృష్ణ. కడియం శ్రీహరి కూతురికి సీట్ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఓటు అడిగే హక్కు కోల్పోయిందన్నారు మందకృష్ణ.
అంతేకాకుండా..’40 ఎడ్ల రాజకీయ జీవితo అని గొప్ప గా చెప్పుకునే కడియం శ్రీహరి ఇలాంటి చేర్యాల వల్ల తాను ఎంతటి అవకాశ వాదో ప్రజలు గుర్తుపెట్టుకోవాలి.. ముగ్గురు మాదిగ బిడ్డలకు తీరని ద్రోహం చేసింది కడియం శ్రీహరి… రాజన్న,దయాకర్ , ఆరూరి రమేష్ కి అన్యాయం చేసాడు కడియం శ్రీహరి… సిట్టింగ్ ఎంపీకి కూడా సిట్ ఇవ్వకుండా,రాకుండా లాక్కున్నాడు… వరంగల్ లోనే టికెట్ తెచ్చుకొని మాదిగలకు అన్యాయం చేసిన కడియం శ్రీహరి.. ఇప్పుడు మళ్ళీ ప్లేట్ మర్చి తన కూతురుతో రాజకీయలు చేస్తున్నాడు… కాంగ్రెస్ లో చేరి ఎంపీ గా అవుతాం అనుకున్న మాదిగ బిడ్డలకి అన్యాయం చేసాడు… కడియం శ్రీహరి నీ చూస్తే…ఊసరవెల్లిలు కూడా సిగ్గుతో తలదించుకుంటాయి..
కడియం శ్రీహరి ఎంతటి అవకాశవాదో , స్వార్ధపరుడో తాను చేస్తున్న పనులవాళ్ళ తెలుస్తుంది.. గో బ్యాక్ నినాదాలు మాదిగ పల్లెలలో ఇవ్వాలని ఈ సందర్బంగా తెలుపుతున్న.. కడియం శ్రీ హరి నీ, వారి కూతురిని పల్లెలోకి రానివ్వకూడా చూడాలి.. దొమ్మటి సాంబయ్య కి కూడా అన్యాయం చేసాడు, ఇప్పుడు అతనీ జీవితం ఆగం చేసాడు… ఘన్పూర్ ఇందిరా కాంగ్రేస్ నుండి చాలా సార్లు పోటీ చేసి ఓడిపోయింది. కానీ కడియం శ్రీహరి కూతురికి కాంగ్రేస్ లో సభ్యత్వం కూడా లేదు ఆమెకు ఇప్పించి, ఒక మహిళా కూడా అన్యాయం చేసాడు కడియం శ్రీహరి.. మాదిగలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కి, బీ ఆర్ ఎస్ పార్టీ కి ఒట్టు వేయద్దు అని ఈ సందర్బంగా తెలియజేస్తున్న..’ అని ఆయన వ్యాఖ్యానించారు.