RTC MD Sajjanar: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సంబంధించిన మాల్ కేసు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల మాల్‌ను ఆర్టీసీ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే..
ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది. ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలని నిర్ణయించామని.. శుక్రవారం ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి మా వినతిని తెలిపామని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు.
అతడు ఓ బ్రోకర్.. పోలీసులు గట్టిగా వాడుకున్నారు. పోలీసుల అండదండలతో అన్నీ నేర్చుకున్నారు. ఎవరిని ఎలా డీల్ చేయాలనేదీ బాగా వంటపట్టించుకున్నాడు. లోసుగులు అన్నీ తెలిసాయి.. ఇంకేముంది.. చెలరేగిపోయాడు… రాజకీయ నాయకుడి అవతారం ఎత్తి.. తానకంటూ ఓ పరిధిని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో ఉన్న ఎవడైనా సరే.. అతడికి కప్పం కట్టాల్సిందే.. లేదంటే వ్యవహారం మామూలుగా ఉండదు.. అతడి పోరు పడలేకనే తమను రక్షించండి బాబోయ్ అంటూ వేడుకుంటున్నారు బాధితులు. వివరాల్లోకి వెళితే.. లక్ష్మణ్ అనే వ్యక్తి…
మేడిగడ్డ బ్యారేజీలో కొనసాగుతున్న మధ్యంతర పనులను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చే వారం రానున్నారు. తన పర్యటనకు ముందు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం నీటిపారుదల శాఖ అధికారులు, మేడిగడ్డ బ్యారేజీ పనులను చేపట్టిన ఎల్‌అండ్‌టీ ప్రతినిధులతో సమీక్షించారు. మేడిగడ్డ బ్యారేజీపై మధ్యంతర చర్యల అమలుకు సంబంధించిన ఎన్‌డీఎస్‌ఏ సిఫార్సులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తాను ముఖ్యమంత్రితో కలిసి బ్యారేజీ వద్దకు వస్తానని చెప్పారు. అయితే.. వానాకాలం లోపు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ,…
మంత్రి అంబటి పిటిషన్ డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు. సత్తెనపల్లిలో 4 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ జరపాలని అంబటి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ దశలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు పేర్కొంది.
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీ పల్లి లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ మహోబాద్ కి దుకాన్ అంటారు ఇదేనా తెలంగాణ లో ప్రతిపక్ష నాయకులను బెదిరిస్తున్నారని, 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ఇలాంటి హత్యలు ఎప్పుడు జరగలేదు మేము అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇలా ఉండేదా అని ఆయన అన్నారు. కొల్లాపూర్ ప్రాంతాన్ని కల్లోళ్ల ప్రాంతంగా సమస్యత్మక ప్రాంతంగా ప్రకటించాలన్నారు.…
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ అభిమానులకు శుభవార్త. కింగ్ ఖాన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డీహైడ్రేషన్ కారణంగా నటుడు నిన్న (బుధవారం) మధ్యాహ్నం ఆసుపత్రిలో చేరారు. షారుక్‌ను అహ్మదాబాద్‌లోని కేడీ ఆస్పత్రిలో చేర్చారు.
జనగామ జిల్లా జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దశమంత్ రెడ్డి నివాసంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల జీవితాలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెంక మీది నుండి పొయ్యలో పడ్డట్టయిందని ఆయన అన్నారు. నిజాం రాజ్యం లాగా బిఆర్ఎస్ పరిపాలన చేసింది, కాంగ్రెస్ పరిపాలన కూడా అలాగే ఉందని, వంద రోజుల్లో పూర్తి చేస్తానన్న ఆరు గ్యారెంటీలు తుంగలో తొక్కిందన్నారు…
వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్లో నకిలీ ఖాతా సృష్టించారు. ఈ ఖాతాను ఉపయోగించుకుని పలువురి నుంచి డబ్బు వసూలు చేసేందుకు సైబర్ నేరగాళ్లు యత్నిస్తున్నారు. కలెక్టర్ ప్రావీణ్య మీటింగ్ లో ఉన్నానని, అర్జెంట్ డబ్బులు కావాలంటూ +94776414080 శ్రీలంక నంబర్ నుంచి ఆ సందేశం పంపిన సబైర్ నేరగాడు డబ్బులు ఫోన్‌పే చేసి, స్ర్కీన్‌షాట్ షేర్ చేయాలని కోరాడు. పలువురికి మేసేజ్‌లు పంపించారు. దీన్ని గమనించిన కలెక్టర్ ప్రావీణ్య తక్షణమే…
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద బీజేపీ ఫ్లోర్ లిడర్ ఏలేటి మహేశ్వరెడ్డి బట్టకాలల్చి మీద వేస్తుండు అని వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆయన కు ఎందుకు కోపమొచ్చిందో అర్థం కాట్లేదని ఆయన అన్నారు. ఉత్తమ్ వైట్ పేపర్ లాంటి వాడు,ఆయన మీద బురద జల్లుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వర్షాలు పడి ధాన్యం తడిసిందన్నారు జగ్గారెడ్డి. తడిసిన ప్రతి గింజా ప్రభుత్వం కొంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,…