Shah Rukh Khan: ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన షారూఖ్.. ప్రత్యేక విమానంలో ముంబైకి ప్రయాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ అభిమానులకు శుభవార్త. కింగ్ ఖాన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డీహైడ్రేషన్ కారణంగా నటుడు నిన్న (బుధవారం) మధ్యాహ్నం ఆసుపత్రిలో చేరారు. షారుక్‌ను అహ్మదాబాద్‌లోని కేడీ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం నటుడి ఆరోగ్యం మెరుగవుతున్నట్లు సమాచారం. డిశ్చార్జ్ అయిన తర్వాత, షారుక్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి ముంబైకి చార్టర్డ్ విమానంలో వెళ్తారు. ఇటీవల, అతని మేనేజర్ పూజా దద్లానీ షారుక్ ఖాన్ ఆరోగ్యం గురించి అప్‌డేట్ ఇచ్చారు. కింగ్ ఖాన్ మేనేజర్ పోస్ట్‌ను షేర్ చేస్తూ షారుక్ ఆరోగ్యం గతంలో కంటే మెరుగ్గా ఉన్నారని రాసుకొచ్చారు. “ఖాన్ ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంది. అతడి శ్రేయోభిలాషులు, అభిమానులందరికీ ఈ విషయాన్ని తెలియజేయాలను కుంటున్నాను. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, ధన్యవాదాలు.” షారూఖ్ మేనేజర్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
READ MORE: CEO Kashi Viswanathan: ధోనీ ఐపీఎల్ 2025లో ఆడుతాడని ఆశిస్తున్నాం..
Also Read
- 200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
షారుఖ్ ఖాన్ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు రావడంతో అభిమానులు షాక్ అయ్యారు. మే 21న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తన జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్), హైదరాబాద్ సర్రైజర్స్ (హెచ్‌ఆర్) మధ్య జరిగిన మ్యాచ్‌ను షారుక్ చూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో షారుక్ తన జట్టుకు మద్దతుగా రెండు రోజుల పాటు అహ్మదాబాద్‌లోనే ఉన్నారు. నటుడు కూడా KKR విజయాన్ని ఆటగాళ్లతో జరుపుకున్నారు. అతను కూడా పూర్తి ఉత్సాహంతో రంగంలోకి దిగారు.. అయితే వేడి కారణంగా అతడు అనారోగ్యం పాలయ్యారు. డీహైడ్రేషన్ బారిన పడ్డారు. పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. షారుక్ 24 గంటల పాటు ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. షారుక్‌తో పాటు భార్య గౌరీ ఖాన్, వ్యాపార భాగస్వామి నటి జూహీ చావ్లా కూడా ఉన్నారు.
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!