పోలీసులు అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని.. అసలు ముద్దాయిలను వదిలేసి తప్పు చేయని వారిపై కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు.హింస జరుగుతుందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డారు.
హైదరాబాద్‌లోని నిజాంపేట్ ఎక్స్ రోడ్‌లో ఉన్నటువంటి సిగ్నస్ గ్యాస్ట్రో హాస్పిటల్ నందు అరుదైన క్యాన్సర్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేసినట్లు హాస్పిటల్ వైద్యనిపుణులు, యాజమాన్యం ప్రకటించింది. 32 ఏళ్లు వయస్సు గల వ్యక్తికి ఆహారం, నీరు తీసుకోవడమే కష్టమే మారడంతో సిగ్నల్ గ్యాస్ట్రో ఆస్పత్రికి రాగా.. ప్రాథమిక పరీక్షలు నిర్వహించి తర్వాత ఎగువ అన్నవాహిక క్యాన్సర్‌గా గుర్తించారు.
ఏపీలో ఓట్ల లెక్కింపు కోసం ఈసీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ తర్వాత జరిగిన ఘర్షణలు, గొడవలు కారణంగా ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుటోంది. కౌంటింగ్ ప్రక్రియను పకడ్బంధీగా చేసేందుకు మూడు అంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. కేంద్ర బలగాలతోపాటు స్థానిక పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
ఒక వయస్సు తర్వాత తాగడం నేరం కాదు.. కానీ తాగి రోడ్లపై న్యూసెన్స్ చేయడం, డ్రైవింగ్ చేయడం మాత్రం నేరమే. ఈ నిర్లక్ష్యానికి ఎంత నష్టం ఉంటుందో ఊహించలేరు. ఏం చేస్తున్నారో సోయి ఉండదు. తాగుతారు.. తాగి రోడ్డెక్కుతారు.. మత్తులో డ్రైవింగ్ చేసి జనాలను గుద్దేస్తారు. యమకింకరుల్లా మారి ప్రాణాలు తీసేస్తారు.
మాంసాహార ప్రియులకు చేదువార్త ఇది. గత కొన్ని రోజులగా ఏపీ, తెలంగాణలో చికెన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఎండలతో పాటు చికెన్ రేట్లు కూడా మండిపోతూ సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. కిలో చికెన్ ధర 'ట్రిపుల్' సెంచరీ దాటింది.
ఇటీవల ఆస్తి కోసం సొంత కుటుంబ సభ్యులను కూడా మోసం చేస్తున్నారు. కుటుంబ సమస్యలు, ఆస్తి గొడవల వ్యవహారంలో అత్తను సొంత కోడలు కిడ్నాప్ చేసి నానా హింసలు పెట్టింది. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం మన్నూరులో ఆస్తి కోసం వృద్ధురాలిని కిడ్నాప్ చేసింది.
Liquor Sales Prohibited in Bengaluru: శాసన మండలి ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలకు కౌంటింగ్ జరగనున్నందున నేపథ్యంలో జూన్ 1 నుండి 6 మధ్య బెంగళూరులో మద్యం అమ్మకాలు నిషేధించబడ్డాయి. జూన్ మొదటి వారంలో, అన్ని వైన్ షాపులు, బార్లు, పబ్‌లు దాదాపు ఒక వారం పాటు మూసివేయబడతాయి. ఇకపోతే.. పబ్‌లు, బార్లు తమ కస్టమర్ లకు ఆల్కహాల్ లేని పానీయాలు, అలాగే ఆహారాన్ని అందించడానికి అనుమతించారు అధికారులు. TGSRTC: హైదరాబాద్ మహా నగరంలో డీలక్స్ బస్సులు..…
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మంత్రి వాహనంపై సీసీబీ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. రేవ్ పార్టీ సమయంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వాహనాన్ని ఉపయోగించిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు.