జూన్ 4వ తేదీన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అనంతరం ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ క్రమంలోనే జూన్ 3వ తేదీన మంత్రుల పేషీలు, ఛాంబర్లను జీఏడీ హ్యాండోవర్ చేసుకోనుంది
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈవో జారీ చేసిన మోమోలను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.
ఎన్నికల కౌంటింగ్‌కు సిద్ధంగా ఉన్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన పేర్కొన్నారు. కౌంటింగ్ సందర్భంగా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేశామని.. 17 నుంచి 26 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి అవుతుందన్నారు.
ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.. తనను ప్రేమించాలంటూ యువతిపై కత్తితో దాడికి పాల్పడి హత్య చేసి.. తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఏలూరు జిల్లా సత్రంపాడులో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రేమ విఫలం కావడంతో యువతి పీక కోసి ఓ యువకుడు కిరాతకంగా హత్య చేశాడు.
తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. . రాష్ట్ర ముఖ్యమంత్రి తోపాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, యారా ప్రముఖులు హాజరయ్యే ఈ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు సికిందరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో వివిధ శాఖలు పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేపట్టాయి. ఉదయం ముఖ్యమంత్రి గన్-పార్క్ లో అమరవీరుల స్థూపానికి పూల మాలలు సమర్పించి నివాళులు అర్పించిన అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో పలు కార్యక్రమాలలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో…
ఇంటెలిజెన్స్ బ్యూరో రిక్రూట్‌మెంట్ పరీక్షతో జూన్ 9న జరగాల్సిన గ్రూప్-ఐ ప్రిలిమినరీ పరీక్షను రెండు-మూడు వారాల పాటు వాయిదా వేయాలని గ్రూప్-ఐ సర్వీసు అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ)ని డిమాండ్ చేశారు. . అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (గ్రేడ్ – II/ఎగ్జిక్యూటివ్) రిక్రూట్‌మెంట్ కోసం ఇప్పటికే టైర్-1 టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు, ఇద్దరి ఘర్షణ కారణంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వీస్‌లలోకి వచ్చే అవకాశాన్ని కోల్పోకూడదని అన్నారు. సార్వత్రిక…
కేసీఆర్ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణం కేసీఆర్ స్వయంకృపరాధమే అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో మీడియ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కి ప్రధాన భాద్యుడు కేసీఆర్ అని ఆయన ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ ఇరుక్కాపోతాడని, కేంద్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసు ను CBI విచారణ చేపట్టాలన్నారు. ప్రధానమంత్రి మోడీ దేశం లో మత్తవిద్వేషాలు రెచ్చగొట్టేలా…
తెలంగాణలో ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా? అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రశ్నించారు. విత్తనాల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ‘రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? విత్తనాల కోసం రైతులకు ఏమిటీ వెతలు ?? పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడ ? ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది ?? ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప.. ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా ?? నిన్న.. ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు..! నేడు.. విత్తనాలు కొందామంటే…
ఫలితాలు వచ్చే ముందు తాత్కాలిక ఆనందాలకు మేము వెళ్లడం లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెట్టింగ్ లో కోసం,సోషల్ మీడియా లో ప్రచారం కోసం మేము ప్రయత్నాలు చేయడం లేదని, నార్త్ లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు సౌత్ లో ఎక్కువ సీట్లు వస్తాయని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు. అమిత్ షా వ్యాఖ్యలు కూడా ఇదే ఉద్దేశంతో మాట్లాడి ఉండవచ్చని, ఉద్యోగులంతా తమ వెనుకే…
ఎన్టీఆర్ 101వ జయంతిని పురస్కరించుకొని.. ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి, వైఎస్సార్సీపీ నేత లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జూన్ 4 తర్వాత ఏపీలో మళ్లీ జగన్ పరిపాలన రాబోతుందన్నారు.. అందుకు ఎన్టీఆర్ ఆశీస్సులు జగన్ మోహన్ రెడ్డికి అందాలని కోరుకుంటున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి మంచి పరిపాలనే నడుస్తుందని ఈ సందర్భంగా ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘వైఎస్ జగన్‌కు ఎన్టీఆర్…