Laxmi Parvati : ఎన్టీఆర్ ఆశీస్సులు జగన్ మోహన్ రెడ్డికి అందాలని కోరుకుంటున్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ 101వ జయంతిని పురస్కరించుకొని.. ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి, వైఎస్సార్‌సీపీ నేత లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జూన్ 4 తర్వాత ఏపీలో మళ్లీ జగన్ పరిపాలన రాబోతుందన్నారు.. అందుకు ఎన్టీఆర్ ఆశీస్సులు జగన్ మోహన్ రెడ్డికి అందాలని కోరుకుంటున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి మంచి పరిపాలనే నడుస్తుందని ఈ సందర్భంగా ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘వైఎస్ జగన్‌కు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయి. జూన్ 4 తర్వాత జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారు. ఏపీలో మళ్లీ మంచి పరిపాలన వస్తుంది’’ అని అన్నారామె. అంతకు ముందు.. మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకుని తాతను స్మరించుకున్నారు.
అంతకుముందు.. ఎన్టీఆర్ మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కలిసి ఉదయమే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. అయితే తమ అభిమాన నటుడు ఈరోజు తాతకు నివాళి అర్పించేందుకు వస్తాడని జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు తెలుసు. దీంతో ఉదయమే వారు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇలా జూ.ఎన్టీఆర్ వచ్చిన సమయంలో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. ఇక సోదరుడు కల్యాణ్ రామ్ తో కలిసి తాత సమాధి వద్ద ఎన్టీఆర్ నివాళులు అర్పిస్తుండగా సీఎం… సీఎం అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేసారు. ఇలా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ.ఎన్టీఆర్ వున్నంతసేపు ఈ నినాదం మారుమోగుతూనే వుంది. ఇలా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సీఎం నినాదాలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read
- Flipkart Sale: ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
- CJP: ‘‘శివాజీ పార్క్లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
- Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
- Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
తాజావార్తలు
-
Flipkart Sale: ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
-
Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
-
CJP: ‘‘శివాజీ పార్క్లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!