చంద్రబాబు.. నితీష్ తో మోడీ మూడోసారి ప్రధాని అయ్యారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 400 సీట్లు గెలుస్తాం అని చెప్పిన మోడీకి మూడోసారి ప్రధాని అయ్యిన ఆనందం లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు అపాయింట్ మెంట్ అడిగితే కూడా ఇవ్వని మోడీ.. చంద్రబాబు బలంతో ప్రధాని అయ్యారని జగ్గారెడ్డి విమర్శించారు. పవన్ కల్యాణ్‌ని ముందు పెట్టి… టీడీపీ ని కలుపుకుని బీజేపీ గేమ్ ఆడిందని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ ప్రధాని…
అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తున్నా హామీలు అమలు చేయడం లేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కమిషన్లు వేస్తూ కాలయాపన చేస్తున్నారని, వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన కాంగ్రెస్ హామీల అమలు ఏమైంది ? అని ఆయన ప్రశ్నించారు. డిసెంబర్ 9న రెండు లక్షల రుణ మాఫీ చేస్తామని చెప్పారు… కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఇచ్చిన మ్యానిఫెస్టో మీద, సోనియా మీద, ఇందిరా గాంధీ మీద కూడా…
లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పి కే.కేశవరావు ని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ(ఆర్గ్. ఇన్చార్జి) కేసీ వేణుగోపాల్ , తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపదాస్ మున్షీ , తదితరులు పాల్గొన్నారు. కేశవ రావుకు ఇంకా రెండేళ్ల పదవీ కాలం మిగిలి ఉన్నప్పటికీ రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకునే అవకాశాలు ఉన్నాయని వర్గాలు తెలిపాయి. ఆయన వైదొలిగితే, కాంగ్రెస్…
మిషన్ భగీరథ పథకం కింద 42 వేల కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలోని 1150 ఆవాసాలకు 50 శాతం నీళ్ళు సరఫరా చేస్తున్నామని ప్రస్తుతం చెబుతున్నారు.. ఇదే పథకం కింద రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. నీటి ఎద్దడి లేదని సర్పంచుల సంతకాలతో గతంలో అసెంబ్లీలో ప్రకటించారు. కేంద్రానికి నివేదిక పంపారని, అంటే ఆనాటి ప్రకటన బోగస్ అని భావించాలా అని…
ఇంటి బయట ఆడుకుంటున్న ఓ చిన్నారిపై ఆరు వీధికుక్కలు దాడి చేయడంతో గాయపడిన ఘటన సంగారెడ్డిలో కలకలం రేపింది. స్థానికులు హుటాహుటిన చిన్నారిని రక్షించారు. ఈ సంఘటన యొక్క CCTV ఫుటేజ్, ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడింది, కుక్కలు పిల్లవాడిపై దాడి చేసిన భయంకరమైన క్షణాన్ని సంగ్రహించింది. సహాయం కోసం బాలుడి కేకలు వేయడంతో, నివాసితులు కుక్కలను కొట్టడానికి , తరిమికొట్టడానికి రాళ్లను ఉపయోగించారు. వారు వేగంగా చర్యలు తీసుకున్నప్పటికీ, బాలుడికి తీవ్ర గాయాలు…
చిల్కూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ నోట్‌బుక్ విరాళం కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ వాలంటీర్లు, సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భీమయ్య, ఇతర ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులకు నోట్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. నోట్‌బుక్ విరాళం డ్రైవ్ యువ తరానికి వనరుల విలువ గురించి అవగాహన కల్పించడం , సహాయక వాతావరణంలో నాణ్యమైన విద్యను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.…
ఇచ్చిన హామీల అమలు లోతుగా అధ్యయనం చేసి అమలులోకి తెస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీ త్వరలోనే చేయబోతున్నామని తెలిపారు. లక్ష రుణమాఫీ కి ఐదేళ్లు తీసుకుని.. అవి కూడా చేయని బీఆర్‌ఎస్ మాపై అరుస్తుందని ఆయన మండిపడ్డారు. మీరు అరిచి గీ పెట్టాల్సిన అవసరం లేదని భట్టి విక్రమార్క అన్నారు. రైతు భరోసా మొత్తము వ్యవసాయం అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నామన్నారు. మేము ఇచ్చే ప్రతి…
మృణాల్ ఠాకూర్ ఇప్పుడు బాలీవుడ్ చిత్రం సన్ ఆఫ్ సర్దార్ 2లో హీరోయిన్గా ఎంపికైంది. సన్ ఆఫ్ సర్దార్లో హీరోగా అజయ్ దేవగన్ నటించగా.. ప్రతినాయకుడిగా ప్రతినాయకుడిగా సంజయ్ దత్ నటించారు. వారు ఈ సీక్వెల్లో కూడా కనిపిస్తారు. అయితే సన్ ఆఫ్ సర్దార్లో హీరోయిన్గా సోనాక్షి సిన్హా నటించిన సంగతి తెలిసిందే. కానీ సన్ ఆఫ్ సర్దార్ 2లో ఆమె స్థానంలో మృణాల్ ఠాకూర్ నటించనున్నారు.