తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఈ సారి మళ్ళీ అధికారంలోకి వచ్చి మరో 15 ఏళ్ళు అధికారంలో ఉంటుందని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఒక లక్షణం ఉందని, ఒకసారి అధికారంలోకి వస్తే పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి ప్రజల చేత ఛీ అనిపించుకునేలా వాళ్ళు ప్రవర్తిస్తారని పేర్కొన్నారు. గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత మళ్ళీ అలాగే జరిగిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ…
తెలంగాణా రాష్ట్రంలో మార్పు రావాలని ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుని ఆరు నెలలు ఐయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతులకు రుణమాఫీ కోసం శ్రీకారం చుట్టమని, ప్రభుత్వం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఇచ్చిన మాటను ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. యువతను ప్రతిపక్షం రెచ్చగొడుతుందని, పది సంవత్సరాలు పాలించిన BRS ప్రభుత్వం యువతకు ఏం చేసిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని, గత ప్రభుత్వ…
ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పని చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఐఏఎస్ అధికారులందరూ విధిగా తమ పరిధిలోని శాఖలు, విభాగాలపై పట్టు సాధించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజా పాలనను అందించేందుకు అందరూ బాధ్యతగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. అందరూ కలిసికట్టుగా పని చేసి ప్రజలకు సుపరిపాలనను అందించి తీరాలని చెప్పారు. దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తెలంగాణను…
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు నేటితో ఏడాది పూర్తి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలతో నాడు సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క తన పాదయాత్రను మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం పిప్పిరి నుంచి ప్రారంభమైన పాదయాత్ర జులై 2న ఖమ్మం నగరంలో ముగిసింది. నాడు నిరాశలో నిండిన కాంగ్రెస్ పార్టీ కేడర్ లో భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్…
ఈ ఏడాది సాగర్ కాల్వల ద్వారా సీతారామ నీళ్ళని ఇస్తామని, పాలేరు వద్ద రిజర్వాయర్లతో గోదావరి జలాలు నింపుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మూడు జిల్లాలను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టును ఏడాదన్నరలోపు పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఒక ప్రణాళిక లేకుండా సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారని ఎనిమిది వేల కోట్ల రూపాయలను వెచ్చించినప్పటికీ ప్రాజెక్టు పూర్తి కాలేదని ఒక చుక్క నీరు…
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. విజయవాడలో జరగనున్న మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆమె ముఖ్యమంత్రికి ఆహ్వానం పంపిన సంగతి తెలిసిందే. అయితే.. సోమవారం ఆమె ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను కూడా కలిసి ఏపీ మాజీ ముఖ్యమంత్రి జయంతి వేడుకలకు హాజరు కావాలని అభ్యర్థించారు. షర్మిల ఆ తర్వాత, ప్రజాభవన్‌లో తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు…
భద్రాచలం విలీన గ్రామ పంచాయితీల పై చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కి మంత్రి తుమ్మల లేఖ రాశారు. ఇద్దరు సీఎం లు రేవంత్ రెడ్డి చంద్రబాబు ఆరో తేదీన భేటీ నేపథ్యంలో ఏపీ లో విలీనమైన ఎటపాక గుండాల పురుషోత్తమ పట్నం ..కన్నాయిగూడెం పిచుకుల పాడు గ్రామ పంచాయితీలను భద్రాచలం లో కలపాలని విన్నవించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ లో విలీనమైన ఏడు మండలాలు.. భద్రాచలం పట్టణం మినహా మిగతా గ్రామాలు ఏపీ…
భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు , సంస్థలలో 17,727 వివిధ గ్రూప్ “బి” , “సి” పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ( SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2024 కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. , చట్టబద్ధమైన సంస్థలు , న్యాయస్థానాలు మొదలైనవి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష సెప్టెంబర్/అక్టోబర్లో నిర్వహించబడుతుంది. దక్షిణాది ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో 10, తమిళనాడులో ఏడు, తెలంగాణలో మూడు, పుదుచ్చేరిలో ఒక కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. దేశంలోని…