Gang Rape Case : మియాపూర్‌లో గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మియాపూర్‌లో గ్యాంగ్ రేప్ కేసు పురోగతి లభించింది. గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసులు మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ కంపెనీ సేల్స్ మెన్ లు గ్యాంగ్ రేప్ పాల్పడ్డారని, సైట్ విజిట్ కోసం అని చెప్పి యువతిని హాస్టల్ నుంచి పికప్ చేసుకున్నారని తెలిపారు. యాదగిరిగుట్ట వద్ద నిర్మానుష భవనం లో కారుని నిలిపివేశారని, కారు చెడిపోయిందని చెప్పి యువతికి సాకుగా చూపెట్టారని పోలీసులు పేర్కొన్నారు. యువతి చేత బలవంతంగా ఆహారాన్ని తినిపించే ప్రయత్నం చేశారని, యువతి ఆహారం తినకపోవడంతో కూల్ డ్రింక్ తీసుకొచ్చి ఇచ్చారని, కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి యువతి కి యువకులు తాగించారని పోలీసులు పేర్కొన్నారు. అదే సమయంలో యువతికి కి కొంత ఆహార పదార్థాలు కూడా బలవంతంగా తినిపించారని, కారులోనే యువతి స్పృహా కోల్పోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. యువతికి స్పృహా వచ్చిన తర్వాత హాస్టల్లో వదిలిపెట్టి వెళ్లిపోయారని, యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని విచారణ జరిపామని పోలీసులు వెల్లడించారు. గ్యాంగ్ రేప్ జరిపిన సంగారెడ్డి, జనార్ధలపై చర్యలు తీసుకోవాలని యువతి ఫిర్యాదు చేసిందని, యువతి ఫిర్యాదు పైన ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!