కోవిడ్19 వైరస్ కొత్త కొత్త రూపాలతో ప్రజలపై దాడికి పాల్పడుతోంది. మొన్నటి వరకు కరోనా డెల్టా వేరియంట్‌తోనే తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు ఇప్పడు దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్‌తో మరోసారి భయపడుతున్నారు. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. దీంతో ఆయా దేశాల్లో ఒమిక్రాన్ తీవ్రతను బట్టి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే తాజాగా కాలిఫోర్నియాలో మరోసారి కోవిడ్ నిబంధనలను తీవ్రం చేస్తున్నట్లు పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.…
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిధులు రూ. 400 కోట్లు బదలాయింపుని వ్యతిరేకిస్తూ ఈ నెల 1నుండి ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. అయితే వీసీ, రిజిస్ట్రార్‌లు పలు దఫాలుగా ఉద్యోగులతో చర్చలు జరిపినా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో నేడు మరోసారి ఉద్యోగులతో ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు రాసిన లేఖల గురించి రిజిస్ట్రార్ వివరించారు. రూ.175 కోట్లు వెనక్కి ఇవ్వాలన్న అంశాన్ని కూడా అధికారులు ప్రస్తావించారు. అంతేకాకుండా…
నేటి సమాజంలో అత్యాధునిక టెక్నాలజీతో రోజుకో కొత్త మోడల్ మార్కెట్లోకి వస్తోంది. కాలంతో పాటు మనం కూడా మారాలంటూ ప్రజలు కూడా కొత్త కొత్త స్మార్ట్ ఫోన్‌లకు అలవాటుపడిపోతున్నారు. అయితే తాజాగా సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) సహకారంతో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజ సంస్థ వివో (VIVO) ‘స్మార్ట్ ఫోన్‌లు మరియు మానవ సంబంధాలు’ అనే కొత్త అధ్యయనాన్ని చేపట్టింది. న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా సహా టాప్ 8 భారతీయ నగరాలలోని తమ 1100 మంది కస్టమర్లతో…
కరోనా మహమ్మారి దెబ్బకు ఏకంగా భారత దేశ ఆర్ధిక పరిస్థితే దెబ్బతింది. కోవిడ్ ధాటికి పేద, మధ్యతరగతి కుటుంబాల్లో చదువుకుంటున్న విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఫీజులపై విద్యార్థులను ఒత్తిడి గురిచేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో కూడా ఈ దేశాలను విద్యాసంస్థలను ప్రభుత్వం జారీ చేసింది. అయినప్పటికీ కొన్ని విద్యాసంస్థలు వాటి తీరును మార్చుకోకపోవడం శోచనీయం. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో…
సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) వచ్చే ఆరు నెలల్లో పిల్లల కోసం కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రారంభించాలని యోచిస్తోందని కంపెనీ సీఈవో అదార్ పూనావాలా మంగళవారం తెలిపారు. పరిశ్రమ సదస్సులో పాల్గొన్న పూనావాలా మాట్లాడుతూ.. ‘కోవోవాక్స్’ వ్యాక్సిన్ ట్రయల్ దశలో ఉందని, మూడేళ్ల వరకు పిల్లలకు రక్షణ కల్పిస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం కోవిషీల్డ్, ఇతర కోవిడ్ వ్యాక్సిన్‌లు 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల కోసం ఆమోదించబడ్డాయని ఆయన అన్నారు. “మేము పిల్లలలో…
3 రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్ర తుదిదశకు చేరుకుంది. గత నెల1న ప్రారంభమైన ఈ పాదయాత్ర నేడు 44వ రోజుకు చేరుకుంది. న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ రాజధాని రైతులు 45 రోజుల మహాపాదయాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో నేడు అలిపిరి పాదాల వద్దకు రాజధాని రైతుల పాదయాత్ర చేరుకుంది. అయితే రేపు తిరుమల శ్రీవారిని రాజధాని రైతులు దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి రాజధాని రైతులకు టీటీడీ అధికారులు…
ఉస్మానియా ఆస్పత్రిని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.7కోట్లతో క్యాథ్‌ల్యాబ్, సిటీ స్కాన్ లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా మరో నాలు క్యాథ్ ల్యాబ్‌లను అందుబాటులోకి తీసువస్తామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్య అందేలా ఏర్పాటు చేస్తున్నామని, ఉస్మానియా అస్పత్రిలో రూ.5 కోట్లతో అధునాతన మార్చురీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాత్రి పూట పోస్టుమార్టం చేసేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నామని ఆయన అన్నారు.…
గడ్డి అన్నారంలో గల మార్కెట్‌ను తరలించేందుకు తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అయితే మార్కెట్‌ను తరలించవద్దని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు విచారణ చేపట్టింది. అంతేకాకుండా గడ్డి అన్నారం మార్కెట్ తరలింపుపై హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్కెట్ తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవచ్చునని హైకోర్టు తెలిపింది. అలాగే బాటసింగారం వెళ్లేందుకు వ్యాపారులకు హైకోర్టు నెల గడువు ఇచ్చింది. నెల రోజుల్లో ప్రభుత్వం బాటసింగారంలో…
ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని తొర్రూర్ మండలం గుర్తుర్ గ్రామ శివారులోని ఊకల్ క్రాస్ రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని వెనుకనుండి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. నర్సంపేట నుండి తొర్రూర్ కు ఆర్టీసీ బస్సు వస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో కండక్టర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందడంలో…
కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో ప్రజలపై మరోసారి విరుచుకుపడుతోంది. ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించిన ఒమిక్రాన్ వేరియంట్ రోజుకో రాష్ట్రంలో వెలుగు చూస్తోంది. ఇటీవల తెలంగాణాకు పక్కనే ఉన్న ఏపీలోనూ రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఒమిక్రాన్‌పై అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం ఆరోగ్యశాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సమావేశంలో థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనే ప్రణాళికలపై…