నేటి సమాజంలో అత్యాధునిక టెక్నాలజీతో రోజుకో కొత్త మోడల్ మార్కెట్లోకి వస్తోంది. కాలంతో పాటు మనం కూడా మారాలంటూ ప్రజలు కూడా కొత్త కొత్త స్మార్ట్ ఫోన్‌లకు అలవాటుపడిపోతున్నారు. అయితే తాజాగా సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) సహకారంతో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజ సంస్థ వివో (VIVO) ‘స్మార్ట్ ఫోన్‌లు మరియు మానవ సంబంధాలు’ అనే కొత్త అధ్యయనాన్ని చేపట్టింది. న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా సహా టాప్ 8 భారతీయ నగరాలలోని తమ 1100 మంది కస్టమర్లతో ఓ సర్వే నిర్వహించింది. వినియోగదారులతో పాటు వారి సంబంధాలపై స్మార్ట్‌ఫోన్‌లు వాటి ప్రభావాన్ని చూపుతున్నాయని ఈ సర్వేలో తేలింది. కనీసం 69 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లలో మునిగితే వారి పని సాఫీగా సాగుతుందని, 74 శాతం మంది తమ పిల్లలు తమను ఏదైనా అడిగినప్పుడు చిరాకు పడుతున్నామని అంగీకరించినట్లు మంగళవారం ఒక నివేదికలో తెలిపింది.

స్మార్ట్‌ఫోన్‌ల మితిమీరిన వినియోగాన్ని ఉద్దేశించి వివో ఇండియా బ్రాండ్ స్ట్రాటజీ డీజీఎం యోగేంద్ర శ్రీరాముల మాట్లాడుతూ ఏదైనా ప్రవర్తన మార్పులో మనకు అవసరమైన మొదటి అడుగు వేయడం చాలా కష్టమైన విషయం. ఈ సర్వే ద్వారా తెలిసిన విషయాలతో స్మార్ట్‌ఫోన్‌లపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని అనుకుంటున్నామని ఆయన వెల్లడించారు.

కోవిడ్ కంటే కోవిడ్ తరువాత స్మార్ట్‌ఫోన్‌లతో గడిపే వారి సంఖ్య 32 శాతం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ అనంతర కాలంలో స్మార్ట్‌ఫోన్‌ల కోసం వెచ్చించే సగటు రోజువారీ సమయం ఆందోళనకరమైన స్థాయిలోనే ఉందని సర్వేలో వెల్లడైనట్లు ఆయన తెలిపారు. కోవిడ్ కాలంలో పిల్లలు, కుటుంబ సభ్యులతో గడిపే సమయం దొరికినా.. ఆ సమయంలో కూడా స్మార్ట్ ఫోన్‌లతోనే ఎక్కువ సమయం గడిపినట్లు సర్వేలో తేలిందని ఆయన అన్నారు.
కనీసం 80 శాతం మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమ పిల్లలతో సమయాన్ని గడుపుతున్నప్పడు కూడా తమ ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. 75 శాతం మంది తమ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా పరధ్యానంలో ఉన్నారని మరియు వారితో ఉన్నప్పుడు కూడా పిల్లల పట్ల శ్రద్ధ చూపడం లేదని అంగీకరించారని ఆయన తెలిపారు. మొత్తానికి ఫోన్‌లపై ఆధారపడటం పెరిగింది. ఎన్ని టెక్నాలజీలు పెరిగిన మానవ జాతి కోసమే.. కానీ మర మనుషులతో సంబంధాలు పెంచుకోని మనషులను పట్టించుకోవడం లేదు. మీరు కూడా ఇలాంటి తప్పే చేస్తుంటే.. తప్పకుండా అవగాహన పెంచుకొండి..