ఇటీవల భారత్‌లోకి ప్రవేశించిన ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో విజృంభిస్తోంది. ఇప్పటికే 20 రాష్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ ప్రజలపై విరుచుకుపడుతోంది. తాజాగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 135 ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో ఆయా ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 600 దాటింది. తెలంగాణలో నిన్న ఒక్కరోజే 12 కేసులు నమోదవడంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 56కు చేరుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 63 ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో కేసుల సంఖ్య 142కు చేరింది. అత్యధికంగా
మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 167లుగా ఉంది. అయితే ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. న్యూఇయర్, పండుగులకు ఆంక్షలు సడలించవద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన వారిని టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌ను వేగంగా చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.