అనంతరపురం జాతీయ రహదారి ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. గుంతకల్లు-బళ్లారి రహదారిపై అనంతపురం జిల్లాలోని విడపనకల్లు మండలం డోనేకల్ వద్ద బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. అయితే కనీసం ప్రమాద హెచ్చరికలు లేకపోవడంతో నిన్న రాత్రి బ్రిడ్జిపై నుంచి నుంచి కిందకు ఓ కారు పడిపోయింది. వంతెనపై నుంచి సుమారు 30 అడుగుల కిందకు కారు పడిపోయింది. దీంతో వంతెన కింద్రి ఉన్న నీటిలో కారు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి జలసమాధి అయ్యాడు.
ఈ ఘటనపై స్థానికులు పోలీసులుకు సమాచారం అందిచడంతో ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే సుమారు 9 గంటల పాటు శ్రమించి కారును బయటకు తీశారు. కారుతో పాటు ఒక మృతదేహాన్ని కూడా పోలీసులు వెలికితీశారు. మృతుడు బళ్లారికి చెందిన అశ్వర్థ నారాయణగా పోలీసులు గుర్తించారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో కూడా ఈ బ్రిడ్జిపైనే ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది.