ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాప్తి చెందింది. అంతేకాకుండా ఈ వేరియంట్ భారత్‌లోకి కూడా ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి చాపకింద నీరులా తయారైంది. దేశంలో పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. అయితే మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీలపై ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా నమోదైన ఒమిక్రాన్ కేసులతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంక్య 4,033కు చేరుకుంది.
అయితే ఒమిక్రాన్ బాధితుల్లో 1,552 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే.. అత్యధికంగా మహారాష్ట్రలో ఒమిక్రాన్ సంఖ్య 1,216కు చేరుకుంది. అలాగే రాజస్థాన్‌లో 529, ఢిల్లీలో 513, కర్ణాటకలో 441, కేరళలో 333, గుజరాత్‌లో 236, తమిళనాడులో 185, తెలంగాణ, హర్యానాలో 123, యూపీలో 113, ఒడిశాలో 74, ఏపీలో 28 చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.