దేశ రాజధాని ఢిల్లీ గురువారం నాడు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అత్యంత కట్టుదిట్టంగా భద్రత ఉండే కోర్టులో పేలుడు సంభవించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఢిల్లీలోని రోహిణి కోర్టులో గురువారం ఉదయం కోర్టు కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో ఒక్కసారి పేలుడు చోటుచేసుకుంది. దీంతో కోర్టు పరిసరాల్లో ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పేలుడుకు గల కారణాలపై విశ్లేషించారు. ఓ గదిలో ఉన్న బ్యాగులోని ల్యాప్‌టాప్ పేలిందని.. ల్యాప్‌టాప్‌లోని బ్యాటరీలే పేలుడుకు కారణమని…