Shocking News: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. ప్రేమ జంటను యువతి కుటుంబీకులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన యూపీలోని లలిత్‌పూర్ జిల్లాలో న్యూ ఇయర్ రోజు జరిగింది. 22 ఏళ్ల వ్యక్తి, 19 ఏళ్ల యువతిని ఆమె కుటుంబ సభ్యులు హత్య చేశారని, ఆ తర్వాత హత్యలను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని సోమవారం పోలీసులు తెలిపారు. యువతి తండ్రి, తల్లి, మామలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.