Lakshmi Parvathi: టీడీపీ అధినేత చంద్రబాబు ఏ ముహూర్తాన బాలకృష్ణ షో అన్ స్టాపబుల్ లో అడుగుపెట్టారో అప్పటి నుంచి ఈ షో గురించి అందరిలోనూ ఆసక్తి మొదలయ్యింది.
Lakshmi Parvathi: తన పెళ్లిపై వ్యక్తిగత కామెంట్లు చేసేవారిపై వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ సంఘటన జరిగినా తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. చరిత్ర చెరిపితే చెరిగిపోదని.. ఎన్టీఆర్‌ను తాను పెళ్లి చేసుకోవడం చంద్రబాబుకు ముందు నుంచీ ఇష్టం లేదన్నారు. తమ వివాహ ప్రకటనను అడ్డుకోవటానికి చంద్రబాబు మైక్ వైరులు కట్ చేసి లైట్‌లు ఆఫ్ చేసి నానా బీభత్సం చేశాడని.. అందరి సమక్షంలో జరిగిన తమ వివాహం…
Lakshmi Parvathi: చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన వైసీపీ నేత లక్ష్మీపార్వతికి ఎదురుదెబ్బ తగిలింది. ఒకరి ఆస్తుల గురించి తెలుసుకోవడానికి మీరెవరు అంటూ సుప్రీంకోర్టు ఆమెను ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్, వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి స్పందించారు. తన కేసులో ఒకరి ఆస్తుల గురించి ప్రశ్నించడానికి తానెవరు అని అత్యున్నత నాయస్థానం ప్రశ్నించిందని.. అయితే జగన్ ఆస్తుల కేసులో శంకర్‌రావు ఎవరు అని…
Lakshmi Parvathi: తెలుగు, సంస్కృతి అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడంపై ఆమె స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని లక్ష్మీపార్వతి ఆకాంక్షించారు. అంతేకాకుండా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి తెలుగు దేశం పార్టీని స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అదే తన కోరిక అని చెప్పారు. చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరించి మహానేత ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి టీడీపీని…
ఏపీలో కొత్త జిల్లాల విభజనపై తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి స్పందించారు. విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని లాక్కొని పదవులు అనుభవించిన చంద్రబాబు చేయని పనిని సీఎం జగన్ చేసి చూపించారన్నారు. ఇన్నాళ్లకు ఎన్టీఆర్ అభిమానుల కోరిక తీరిందన్నారు. ఎన్టీఆర్‌తో ఎలాంటి సంబంధం లేనప్పటికీ సీఎం జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా ఏపీలోనే మంచి పేరు తెచ్చుకుంటుందని ఆశిస్తున్నట్లు…
ఎన్టీఆర్ 26వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన సమాధికి నందమూరి కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి కూడా నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఆయన ఆత్మతో మాట్లాడానని ఆమె వెల్లడించారు. 26 ఏళ్ల తర్వాత ఒక రహస్యం చెబుతున్నానని… ఎన్టీఆర్ చనిపోయినప్పుడు జీవిత, రాజశేఖర్ తనను మద్రాస్ తీసుకెళ్లి ఒక అమ్మాయితో మాట్లాడించారన్నారు. ఎన్టీఆర్ ఆత్మ 16ఏళ్ల అమ్మాయిలో ప్రవేశించి…
ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై నందమూరి ఫ్యామిలీ ఖండించడంపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి స్పందించారు. అసెంబ్లీలో ఏమీ జరగకపోయినా టీడీపీ నేతలు మసిపూడి మారేడుకాయ చేస్తున్నారని ఆరోపించారు. ఆనాడు ఎన్టీఆర్‌ను మోసం చేసినట్లే.. ఈనాడు నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు మోసం చేస్తున్నాడని లక్ష్మీపార్వతి విమర్శలు చేశారు. కన్నీళ్లు పెట్టుకుని చంద్రబాబు పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. చంద్రబాబు వల్ల ఎన్టీఆర్ ఎంతో బాధపడ్డారని లక్ష్మీపార్వతి గుర్తుచేసుకున్నారు. Read Also: అసెంబ్లీ ఘటనపై స్పందించిన ఎన్టీఆర్…
తెలుగు అకాడమీని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని ఎంతో ఆశగా ఉంది. కానీ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. గత ప్రభుత్వం ఐదేళ్లలో తెలుగు అకాడమీని నిర్వీర్యం చేసిపడేసింది. తెలుగు అనే పేరు లేకుండా చేసేశారు. 30 వేల ప్రభుత్వ పాఠశాలలు మూసేశారు అని తెలుగు అకాడమీ సొసైటీ ఛైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. తెలుగు భాషాభిమానులు ఆలోచన చేసుంటే ఇలాంటి దుర్ధశ పట్టేది కాదు అని తెలిపారు. ఇక వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత…