ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ విద్యావేత్త, ప్రవాసాంధ్రుడు లకిరెడ్డి బాలరెడ్డి (88) అనారోగ్యంతో బాధపడుతూ అమెరికాలో కన్నుమూశారు. కృష్ణా జిల్లా మైలవరం మండలం వెల్వడంలో జన్మించిన ఆయన పేరుతో ఇంజినీరింగ్ కాలేజీ కూడా నడుస్తోంది. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఆయన ఉస్మానియా కాలేజీలో బీఎస్సీ డిగ్రీ, బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ కూడా అందుకున్నారు. 1960లో అమెరికా వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో కెమికల్ ఇంజినీరింగ్‌లో ఎంఎస్ పూర్తి…