వరుస హిట్‌లతో దూసుకుపోతున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మొదటి సారి ఓ అమ్మాయి గెటప్‌లో కనిపించనున్నాడు. గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన విశ్వక్.. త్వరలో 'లైలా' అనే చిత్రంలో అమ్మాయి గెటప్‌లో అదరగొట్టనున్నట్టు తెలుస్తోంది. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ 'లైలా' సినిమా చేస్తున్నాడు.