తిరుమలలో క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ ప్రోత్సహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో అడుగు ముందుకేసింది. లడ్డూ కౌంటర్ల వద్ద కియోస్కి మెషిన్లు ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది. భక్తులు నగదు రహిత చెల్లింపులతో లడ్డూ ప్రసాదాలు పొందే సౌలభ్యం కల్పించింది. మరో వైపు అదనపు లడ్డూ నియంత్రణపై శ్రీవారి భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.