చాలా మంది జీవితం బాగుపడాలంటే అదృష్టం కలిసి రావాలంటారు. ఇది సరదాగా అంటారో లేదంటే నిజంగానే అంటారో తెలియదు గానీ.. ఓ కార్మికుడి పట్ల ఇది అక్షరాల నిజమైంది. మధ్యప్రదేశ్‌కు చెందిన కార్మికుడికి రూ.80 లక్షల విలువైన వజ్రం దొరికింది. దీంతో అతడి కుటుంబ సభ్యులంతా సంతోషంతో ఎగిరి గంతులు వేస్తున్నారు.
ఓ కార్మికుడు రైల్వే వంతెనపై ఉన్న పట్టాలపై పనిచేస్తుండగా సడన్ గా రైలు రావడంతో.. అతను ప్రాణాలు రక్షించుకునేందుకు భారీ సాహసం చేశాడు. ముందు రైలు దూసుకొస్తుంది.. పక్కకు వెళ్దామంటే నది ప్రవహిస్తుంది. అతను చేసేదేమీ లేకుండా వెంటనే కిందనున్న నదిలోకి దూకాడు. ఈ ఘటన బీహార్ లోని సహర్సా జిల్లాలో జరిగింది.