రష్యా కొనసాగిస్తోన్న భీకర యుద్ధంతో ఉక్రెయిన్‌లో నగరాలు వణికిపోతున్నాయి. మూడు నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో పలు ప్రాంతాలు ఇప్పటికే రష్యా ఆధీనంలోకి వెళ్లిపోగా మరికొన్ని నగరాలు మాత్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. రాజధాని కీవ్ పై కూడా రష్యా సేన దాడి చేయగా.. ఉక్రెయిన్ బలగాల ఎదురుదాడులతో వెనుదిరిగింది. పాక్షికంగా దెబ్బతిన్న కీవ్ నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. రోజువారీ కార్యకలాపాలు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో…